సభలో పద్ధతి & విపక్షాల విమర్శలకు సమాధానం
అందరూ సమన్వయంతో ముందుకెళ్లాలని స్పష్టం చేశారు.
ఎమ్మెల్యేల హాజరుపై సీఎం అసహనం
కాంగ్రెస్‌కు కీలక సమయం
తెలంగాణ ధ్వని : తెలంగాణ సీఎం ఎం. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కీలక సూచనలు చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తప్పకుండా హాజరుకావాలని స్పష్టం చేశారు. బుధవారం అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (CPL) భేటీలో ఆయన పాల్గొన్నారు.సీఎం రేవంత్ మాట్లాడుతూ, ఈసారి రెండో పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశం జరుగుతుండటంతో ఇది అత్యంత కీలకమైనది అన్నారు. గత 15 నెలల్లో ప్రభుత్వ పనితీరుపై చర్చించే అవకాశం ఉన్నందున, అన్ని అంశాలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.విపక్షాలు సభలో గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తాయని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శాంతంగా, బలమైన వాదనలతో సమాధానం ఇవ్వాలని హితవు పలికారు.కొంత మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీని నిర్లక్ష్యం చేస్తున్నట్లు సీఎం రేవంత్ అసహనం వ్యక్తం చేశారు.
సభకు హాజరైతే ఏం జరుగుతుందో తెలుస్తుంది. ప్రతి ఒక్కరూ ముందుగానే ప్రిపేర్ అయి రావాలి” అని అన్నారు.ప్రభుత్వ విప్లు ఎమ్మెల్యేల హాజరును పర్యవేక్షించాలని ఆదేశించారు.సీఎల్పీ భేటీలో నాగార్జునసాగర్ ఎమ్మెల్యే జైవీర్ మద్యలోనే బయటకు వెళ్లడంతో, ఆయనపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ బడ్జెట్ సమావేశాల్లో, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, ప్రజా సంక్షేమంపై విస్తృత చర్చ జరుగనుంది. అంతేగాక, విపక్షాల దాడిని తిప్పికొట్టేలా కాంగ్రెస్ సభ్యులు సిద్ధంగా ఉండాలని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.
రిపోర్టర్. ప్రతీప్ రడపాక