తెలంగాణా ధ్వని : కరీంనగర్ జిల్లా గౌరవ ఆర్.టి.ఎ మెంబర్ శ్రీ పడాల రాహుల్ గారిపై సోషల్ మీడియా వేదికగా తప్పుడు ఆరోపణలు చేస్తూ, అసత్య సమాచారాన్ని ప్రచురిస్తున్న ఘటనపై యువజన కాంగ్రెస్ నాయకులు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదును కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు పంజాల కృపాసాగర్ గారి నేతృత్వంలో సమర్పించారు. ఫిర్యాదులో యువజన కాంగ్రెస్ కరీంనగర్ రూరల్ అధ్యక్షుడు గట్టు ప్రశాంత్ మరియు జిల్లా ఉపాధ్యక్షుడు కిమ్ ఫహద్ లు శ్రీ పడాల రాహుల్ గారి పరువు నష్టం కలిగించే విధంగా ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారన్నారు.
వసూలు దందాలో పాల్గొన్నారు అనే అసత్య కథనాలను సోషల్ మీడియా ద్వారా వ్యాప్తి చేస్తూ, దినపత్రికల కవరేజీని వక్రీకరించి ప్రచారం చేస్తున్నారన్న ఆరోపణలతో ఈ ఫిర్యాదు చేయబడింది.ఈ వ్యవహారంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు పోలీసులను కోరారు.
ఈ ఫిర్యాదులో పాల్గొన్న యువజన కాంగ్రెస్ నాయకుల్లో భూక్యా గజన్ నాయక్ (జిల్లా ఉపాధ్యక్షుడు), కొక్కు సందీప్ ముదిరాజ్ (కొత్తపల్లి మండల అధ్యక్షుడు), కసీఫ్ మీర్జా (టౌన్ ఉపాధ్యక్షుడు), సూఫియాన్ (అసెంబ్లీ సెక్రటరీ), అర్జున్ గౌతమ్ రెడ్డి, జాప శ్రవణ్ రెడ్డి, మేడి రాజు, జెట్టి విశ్వేశ్వర్, రాష్ట్ర సోషల్ మీడియా కార్యదర్శి అనురాగ్ దాసరపు తదితరులు ఉన్నారు.
ప్రజా ప్రతినిధుల గౌరవాన్ని దెబ్బతీసే తప్పుడు ప్రచారాలను సహించేది లేదని, ఇకపై ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠినంగా స్పందిస్తామని వారు హెచ్చరించారు.
రిపోర్టర్.ప్రతీప్ రడపాక