తెలంగాణ ధ్వని : తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన ఇందిరమ్మ ఇళ్లు హౌసింగ్ స్కీమ్ 2025 పేద వర్గాలకు సులభమైన గృహ సదుపాయాలు అందించడమే లక్ష్యంగా రూపొందించబడింది. ఈ పథకం కింద తొలి దశలో రాష్ట్రవ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లు నిర్మించేందుకు ప్రభుత్వం ₹22,000 కోట్ల నిధులు కేటాయించింది. 2024 మార్చి 11న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించి, తక్కువ ఖర్చుతో ఇళ్లు అందిస్తామన్న హామీ ఇచ్చారు. ట్రాన్స్‌జెండర్లు, పారిశుధ్య కార్మికులు, వ్యవసాయ కార్మికులు, దళితులు, దివ్యాంగులు వంటి వర్గాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు.
లబ్ధిదారులకు ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం ₹5 లక్షల ఆర్థిక సహాయం అందించనుంది. స్థలం లేని వారికి స్థలంతో పాటు ₹5 లక్షలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దరఖాస్తుదారులు తెలంగాణలో శాశ్వత నివాసితులు కావాలి, ఇల్లు లేకపోవాలి, ఇతర గృహ పథకాల నుంచి లబ్ధి పొందకపోవాలి. అవసరమైన డాక్యుమెంట్లలో ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, రేషన్ కార్డ్, అడ్రస్ ప్రూఫ్, మొబైల్ నంబర్ అవసరం ఉంటుంది.
ఇందిరమ్మ ఇళ్లకు అప్లై చేసిన వ్యక్తులు తమ వివరాలు చెక్ చేసుకోవడానికి:
- పథకం అధికారిక వెబ్‌సైట్ (https://indirammaindlu.telangana.gov.in) ను సందర్శించాలి.
- మొబైల్ నెంబర్, దరఖాస్తు నెంబర్ లేదా ఆధార్ నెంబర్ ద్వారా డేటా వెరిఫై చేసుకోవచ్చు.
- అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత, లబ్ధిదారుల జాబితాను చూడవచ్చు.
అర్హతల వివరాలు:
తెలంగాణలో శాశ్వత నివాసం ఉన్న పేదలు మాత్రమే అప్లై చేయవచ్చు.
ఇళ్లు లేని పేదలు అర్హులు.
ఇతర గృహ పథకాల నుంచి లబ్ధి పొందినవారు అనర్హులు.
అవసరమైన డాక్యుమెంట్లు: ఆధార్ కార్డు, పాన్ కార్డు, రేషన్ కార్డు, అడ్రస్ ప్రూఫ్, మొబైల్ నెం
ఆర్థిక సాయం దశలు:
పునాది పూర్తి తర్వాత రూ.1 లక్ష.
గోడలు నిర్మించాక రూ.1.25 లక్షలు.
స్లాబ్ సమయంలో రూ.1.75 లక్షలు.
నిర్మాణం పూర్తయిన తర్వాత రూ.1 లక్ష.
రిపోర్టర్ ప్రతీప్ రడపాక