telanganadwani.com

MLANayiniRajenderReddy

ఎకానామిక్స్ జాతీయ సదస్సు బ్రోచర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి…

తెలంగాణ ధ్వని :  పింగిళి ప్రభుత్వ మహిళా కళాశాల (స్వయం ప్రతిపత్తి) హనుమకొండ అర్థశాస్త్ర విభాగం ఆద్వర్యంలో జులై 25 మరియు 26వ తేదీలలో
“డిజిటల్ ఎకానమీ ద ఇంపాక్ట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఆన్ గ్లోబల్ మార్కెట్స్ “అనే అంశంపై నిర్వహించబడే రెండు రోజుల ఎకనామిక్స్ జాతీయ సదస్సుకు సంబంధించిన బ్రోచర్ను.
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి  ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పింగిళి కళాశాలలో అన్ని విభాగాలలో మేధాసంపత్తిని విద్యార్థులకు అందిస్తుందని,
అన్ని వసతులు,అత్యాధునిక బోధనను అందిస్తున్న పింగిలి కళాశాలలో చేరి అనేక అవకాశాలను విద్యార్థులు సద్వినియోగ పరుచుకొని తమ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని సూచించారు.
కళాశాలలో నిర్వహిస్తున్న అనేక కార్యక్రమాలను ఎమ్మెల్యే  అభినందించారు. కళాశాల ప్రిన్సిపాల్ లెఫ్టినెంట్ ప్రొఫెసర్ బి. చంద్రమౌళి  మాట్లాడుతూ పింగిలి కళాశాలలో అనేక రకాల విభాగాలలో .
ఇదివరకు జాతీయ సదస్సులు ఎన్నో నిర్వహించామనీ, విద్యార్థులు అన్ని రంగాలలో జ్ఞానాన్ని నైపుణ్యాన్ని పెంపొందించుకోవడా నికి కళాశాలలోని సదస్సులు ఉపయోగపడుతాయని అన్నారు.
సదస్సు కన్వీనర్ డా. పి .పద్మ  మాట్లాడుతూ  ఐ సి ఎస్ ఎస్ ఆర్ సౌజన్యంతో  నిర్వహిచనున్న ఈ సదస్సుడిజిటల్ ఆర్థిక వ్యవస్థ ప్రపంచ మార్కెట్లపై కృతిమ మేధస్సు ఏ విధంగా ప్రభావితం చేయగలుగుతుందో.
  తెలియజేయడం జరుగుతుందని అన్నారు.ఆచార్యులు,విద్యావేత్తలు,అధ్యాపకులు,పరిశోధకులు, విద్యార్థులు ఈ సదస్సులో పాల్గొనాలని కోరారు కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.
రిపోర్టర్.ప్రతీప్ రడపాక 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top