తెలంగాణ ధ్వని : ఎస్ ఆర్ యూనివర్సి టీ, వరంగల్ — ఎలకతుర్తి పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో — భారత సైన్యంలో కొనసాగుతున్న ఆపరేషన్ సిందూర్‌కు మద్దతుగా మరియు పహల్గామ్ ఉగ్రదాడిలో మరణించిన పర్యాటకులు మరియు ఆపరేషన్ సిందూర్‌లో వీరమరణం పొందిన సైనికుల జ్ఞాపకార్థంగా ఈ రోజు ర్యాలీ నిర్వహించింది.
ఈ కార్యక్రమానికి డా. ఏ.వి.వి. సుధాకర్ (స్టూడెంట్ వెల్ఫేర్ డీన్) మరియు లెఫ్టినెంట్ రాజేశ్వర్ రావు (అసోసియేట్ NCC ఆఫీసర్) నాయకత్వం వహించారు. ఈ ర్యాలీలో NCC కేడెట్లు, విద్యార్థులు, బోధనా సిబ్బంది మరియు బోధేతర సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఎలకతుర్తి పోలీస్ స్టేషన్ మరియు స్థానిక అధికారుల సహకారంతో, ఈ కార్యక్రమాన్ని శాంతియుతంగా, నియమ నిబంధనల మేరకు నిర్వహించారు. ఈ ర్యాలీ సైనికుల త్యాగాలను గౌరవించడానికి, దేశ రక్షణలో వారి పాత్రను గుర్తించడానికి, మరియు యువతలో దేశభక్తి భావనను పెంపొందించడానికి నిర్వహించబడింది.
ఎస్ ఆర్ యూనివర్సిటీ ప్రతినిధులు యువత దేశభద్రత కోసం ముందడుగు వేయాల్సిన అవసరాన్ని తెలియజేస్తూ, “దేశ సేవ ప్రతి పౌరుని భాద్యత” అనే సందేశాన్ని నొక్కి చెప్పారు. రిపోర్టర్ : అనూష కల్తీ