telanganadwani.com

IPLPostponed

ఐపీఎల్ మ్యాచ్ లు నిరవధిక వాయిదా!

  • ఈ ఏడాది సెప్టెంబర్ అక్టోబర్ లో నిర్వహించే ఛాన్స్!
తెలంగాణ ధ్వని : భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ -2025ను BCCI నిరవధిక వాయిదా వేసింది.
గురువారం ధర్మశాల వేదికగా జరిగిన పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ అర్ధాంతరంగా రద్దయిన సంగతి తెలిసిందే. మ్యాచ్ జరుగుతున్న సమయంలో లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి పాకిస్తాన్ డ్రోన్స్, మిస్సైల్స్ తో దాడులు జరిపిన సంగతి తెలిసిందే.
దీంతో భద్రతా కారణాలతో మ్యాచ్‌ను రద్దు చేశారు. కాగా వాయిదా పడిన ఐపీఎల్  లీగ్ మ్యాచ్ లు ఈ ఏడాది సెప్టెంబర్ అక్టోబర్ లో జరగవలసిన ఆసియా కప్ ప్లేస్ లో ఈ ఐపీఎల్ మ్యాచ్ లు నిర్వహిస్తారని క్రికెట్   వర్గాలు తెలిపాయి..
ఐపీఎల్ నిరవధిక వాయిదా పడడంతో రాయల్ ఛాలెం  జర్స్ ఆఫ్ బెంగళూరు అభిమానులు నిరాశలో మునిగిపోయారు. ఈ ఏడాది ఆరంభం నుంచి అదరగొడుతున్న ఆర్‌సీబీ.. ఈరోజు శుక్రవారంగెలిచి ప్లే ఆఫ్స్‌కు చేరుకోవాలని చూసింది.
కానీ, ఐపీఎల్ వాయిదాతో ఆ జట్టుకు నిరాశ ఎదురైం ది. ఎన్నో ఏళ్ల నుంచి కప్పు కోసం ఎదురుచూస్తున్న బెంగళూరు ఫ్యాన్స్ ఈ సారి కూడా అది కలగానే మిగిలి పోతుందేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రిపోర్టర్. ప్రతీప్ రడపాక 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top