తెలంగాణ ధ్వని : తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దులో ఉన్న కర్రిగుట్ట ల్లో కేంద్ర బలగాలు చేపడుతోన్న కూంబింగ్ నిర్విరామంగా కొనసాగుతూనే ఉంది.
ఈ నేపథ్యంలోనే చీమలు కూడా దూరని చిట్టడవిలో మావోయిస్టులు అమర్చిన మందుపాతరలు, ఐఈడీ బాంబు లను ఐడెంటిఫై చేశాక వాటిని నిర్వీర్యం చేస్తూ భద్రతా దళాలు ముందుకు సాగుతున్నాయి.
అదేవిధంగా మావోయిస్టులు (Maoists) ఏర్పాటు చేసుకున్న షెల్టర్లను గుర్తించి వాటిని నాశనం చేస్తున్నారు.
మరోవైపు కర్రిగుట్టల్లో హత్యాకాండను ఆపాలంటూ పౌర హక్కుల సంఘాల నేతలు మండిపడుతున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి ని కలిసిన పీస్ కమిటీ కర్రిగుట్టల్లో ఎన్‌కౌంటర్ ఆపేలా కేంద్రానికి ప్రతిపాదనలు పంపాలని అభ్యర్థించింది.
ఈ నేపథ్యంలోనే కీలక పరిణామం చోటుచేసుకుంది. కర్రిగుట్టల అటవీ ప్రాంతాన్ని భద్రతా బలగాలు తమ అధీనంలోకి తెచ్చుకున్నాయి. ఈ మేరకు ధోబే కొండలు, నీలం సరాయికొండల్లో ఫార్వర్డ్ బేస్ క్యాంపులను ఏర్పాటు చేసుకున్నారు.
అదేవిధంగా అలుబాక శివారులో మరో బేస్ క్యాంప్‌ను కూడా ఏర్పాటు ప్రక్రియి పూర్తి చేశారు. ఇక మావోయిస్టుల జాడను తెలుసుకునేందుకు డ్రోన్ల కోసం ప్రత్యేక సిగ్నలింగ్ టవర్ల ను నిర్మించారు.
సీఆర్‌పీఎఫ్ కు చెందిన ప్రత్యేక K9, K3 డాగ్ స్క్వాడ్ బృందాలతో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. కర్రిగుట్టల్లో వందల సంఖ్యలో మవోయిస్టులు భూగర్భ బంకర్లు ఉన్నట్లుగా సమాచారం అందడంతో ముందు ఆ బంకర్ల గుర్తింపునకు సీఆర్‌పీఎఫ్ దళాల వేట కొనసాగుతోంది.
రిపోర్టర్.ప్రతీప్ రడపాక