తెలంగాణ ధ్వని : వరంగల్ 20వ డివిజన్ కాంగ్రెస్ కార్పొరేటర్ గుండేటి నరేంద్ర కుమార్‌ను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. ఆయనపై సొంత పార్టీ మహిళా నాయకురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఈ అరెస్టు పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు చర్యగా బీజేపీ నేతలు అభివర్ణిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యుడు, వరంగల్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు ఈ అరెస్టును తీవ్రంగా ఖండించారు.
ప్రజాస్వామ్యంలో రాజకీయ విభేదాలను ఇలా వ్యక్తిగతమైన వేధింపులుగా మలచడం తప్పని ఆయన పేర్కొన్నారు. నరేంద్ర కుమార్‌ను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
వరంగల్ పోలీస్ కమిషనర్ తక్షణం స్పందించి విచారణ చేపట్టాలని కోరారు. అక్రమ అరెస్టుల ద్వారా ప్రజాప్రతినిధుల గొంతు నొక్కడం అన్యాయమని తెలిపారు.
ప్రజలు దీన్ని గమనించి, రాజకీయం పేరుతో జరిగే దుర్వినియోగాన్ని ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. న్యాయం కోసం పోరాడతామని బీజేపీ నేతలు స్పష్టం చేశారు.
రిపోర్టర్. ప్రతీప్ రడపాక