telanganadwani.com

NaxalSurrender

ఛత్తీస్‌గఢ్ సుక్మాలో 33 నక్సలైట్ల లొంగింపు – 17 మందిపై రూ.49 లక్షల రివార్డు..

  • ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లాలో 33 మంది నక్సల్స్ శుక్రవారం లొంగిపోయారు.
  • వీరిలో 17 మందిపై కలిపి రూ.49 లక్షల రివార్డులు ఉన్నాయి.
  • అభివృద్ధి కార్యక్రమాలు, మావోయిస్టుల దురాచారాలపై విసుగు లొంగింపుకు కారణాలు.
  • లొంగింపులో CRPF, కోబ్రా, పోలీసులు కీలక పాత్ర వహించారు.

తెలంగాణ ధ్వని : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో శుక్రవారం రోజు 33 మంది నక్సలైట్లు భద్రతా బలగాల ఎదుట లొంగిపోయారు. లొంగిన వారిలో 17 మందిపై కలిపి రూ.49 లక్షల బహుమతి ఉంది. మిలటరీ డిప్యూటీ కమాండర్ ముచాకి జోగా, ఆయన భార్య ముచాకి జోగి వంటి కీలక సభ్యులు లొంగిపోయిన వారిలో ఉన్నారు. వీరిలో 9 మంది మహిళలు ఉండగా, కొందరు భద్రతా బలగాలపై దాడుల్లో కూడా పాల్గొన్నారు. మావోయిస్టు దురాచారాలపై విసుగు, స్థానిక గిరిజనులపై జరుగుతున్న అన్యాయాలపై ఆవేదన, అభివృద్ధి పనుల పట్ల ఆకర్షణ ఈ లొంగింపుకు ప్రధాన కారణాలిగా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ‘నియాద్ నెల్లనార్’ పథకం స్థానికులపై ప్రభావం చూపినట్లు అధికారులు తెలిపారు. మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యులు దేవే, దుధి బుధ్రాలపై ఒక్కొక్కరిపై రూ.5 లక్షల రివార్డు ఉంది. మిగతా ఏడుగురిపై రూ.2 లక్షల రివార్డులు ఉన్నాయి. సుక్మా జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కిరణ్ చవాన్ ప్రకారం, ఈ లొంగింపులో జిల్లా పోలీస్, రిజర్వ్డ్ గార్డులు, సీఆర్‌పీఎఫ్, కోబ్రా బలగాలు సమిష్టిగా పనిచేశాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇటీవల ప్రకటించిన విధంగా 2025 మార్చి 31 నాటికి నక్సలిజాన్ని నిర్మూలించాలన్న లక్ష్యానికి ఇది ఒక మైలురాయి. ఈ పరిణామం ప్రభుత్వ దృష్టిలో శాంతి, అభివృద్ధి దిశగా ఒక చక్కటి ముందడుగు. భవిష్యత్తులో మరిన్ని లొంగింపులు జరగే అవకాశం ఉన్నట్టు సమాచారం.

రిపోర్టర్. ప్రతీప్ రడపాక 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top