తెలంగాణ ధ్వని : జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై ఉన్న కోమల్ల టోల్ గేట్ వద్ద లారీ ఒకటి అదుపుతప్పి బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా దూసుకొచ్చిన లారీ టోల్ గేట్ క్యాబిన్‌ను ఢీకొట్టి ధ్వంసం చేసింది. ఈ ఘటనలో ఒప్పంద ఉద్యోగి గాయపడగా, అక్కడ నిలిపివున్న మరో కారు కూడా పూర్తిగా ధ్వంసమైంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని పరిశీలన చేపట్టారు. ప్రమాద సమయంలో లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు స్థానికంగా సమాచారం లభించింది. పోలీసులు ట్రాఫిక్‌ను పునరుద్ధరించి, ఇతర వాహనాల రాకపోకలకు ఆటంకం కలగకుండా చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి, మరింత విచారణ చేపట్టారు.
రిపోర్టర్. ప్రతీప్ రడపాక