* డబుల్ బెడ్రూంలు ఇచ్చే వరకు దీక్ష ఆగదు-
ప్రకటించిన జర్నలిస్టులు..
* సంఘీ భావం ప్రకటించిన వర్కింగ్ జర్నలిస్ట్ అఫ్ ఇండియా ఉమ్మడి వరంగల్ జిల్లా కన్వీనర్ పులి శరత్ కుమార్.
* రాష్ట్ర ఉపధ్యక్షుడు తాడూరి కరుణాకర్ కార్యదర్శి ప్రమోద్ కుమార్.
* రెండో రోజుకు చేరిన నిరాహార దీక్ష
తెలంగాణ ధ్వని: వర్కింగ్ జర్నలిస్ట్ ల కోసమే నిర్మించి నిర్లక్ష్యంగా వదిలి వేసిన దేశాయిపేట లక్ష్మి టౌన్ షిప్ లోని డబుల్ బెడ్రూంలను తక్షణమే అర్హులైన పాత్రికేయులకు కేటాయించాలని కోరుతూ చేపట్టిన నిరాహార దీక్ష మంగళవారం రెండో రోజుకు చేరుకుంది. జర్నలిస్టుల దీక్షలకు వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా ఉమ్మడి వరంగల్ జిల్లా కన్వీనర్ పులి శరత్ కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాడూరి కరుణాకర్, కార్యదర్శి ప్రమోద్ కుమార్ పాల్గొని తమ సంఘీభావం ప్రకటించి, దీక్షల్లో కొద్ది సేపు కూర్చున్నారు. ఈ సందర్భంగా పులి శరత్ కుమార్ మాట్లాడుతూ…
పాత్రికేయుల నిరాహార దీక్షకు వరంగల్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా తరుపున పూర్తి సహకారం ఉంటుందన్నారు. జాతీయ స్థాయి పత్రికలో మాత్రమే జీతాలతో పత్రికల్లో పని చేస్తున్నారని అన్నారు. నివాస స్థలాలు ఇచ్చే వరకు పోరాటం చేస్తున్న జర్నలిస్టులకి వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా అండగా ఉంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులతో నిర్మించిన వీటిని వెంటనే జర్నలిస్టులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు డాక్టర్ హరి రమాదేవి హాజరై తమ సంఘీభావం ప్రకటించారు. పీడీఎస్ యూ జిల్లా కార్యదర్శి రాచకొండ రంజిత్ కుమార్ దీక్షా శిబిరాన్ని సందర్శించి, జర్నలిస్టుల ఉద్యమానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పాత్రికేయులకు డబుల్ బెడ్ రూంలు వచ్చే వరకు అండగా ఉంటానంటూ హామీ ఇచ్చారు.
ఉదయమే పలువురు జర్నలిస్టులు భద్రకాళి దేవాలయంలో పూజలు నిర్వహించి, అమ్మవారికి వినతి పత్రం అందజేశారు. జర్నలిస్ట్ లు జక్కు విజయ్ కుమార్, జన్ను శ్యామ్, సొటాల హరి నరేష్, ఈనాడు చిన్న బాబు, ఉర్దూ జర్నలిస్ట్ అధ్యక్షుడు మహుబుల్, ఫోటో జర్నలిస్ట్ మాషుక్, కమాటం వేణు, టివీ 5 బండి రవి,టివీ 9 పెరుమాండ్ల మధు, కొత్తపల్లి రమేష్, రడపాక ప్రదీప్, తాటిపెళ్ళి నరేష్, ఇంద్ర రెడ్డి, అశోక్, శంకర్, బండ్ల కరుణాకర్, అజయ్, సత్యం, దాసరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్: కిరణ్ సంగ…