తెలంగాణ ధ్వని : స్టేషన్ ఘనపూర్, చాగల్లు గ్రామంలో డా. కార్తీక్స్ డెంటల్ హాస్పిటల్ ఘనపూర్ బ్రాంచ్ ఆధ్వర్యంలో ఉచిత దంతవైద్య శిబిరం నిర్వహించబడింది.
ఈ శిబిరంలో గ్రామస్థులకు ఉచితంగా దంత పరీక్షలు, మందులు మరియు పేస్ట్ పంపిణీ చేయడం జరిగింది. డా. కార్తీక్ రాజు మాట్లాడుతూ, పిల్లలకు బ్రష్ చేయడం ఎలా చేయాలో, దంత సంరక్షణకు సంబంధించిన ముఖ్యమైన సూచనలు ఇచ్చారు.
క్యాంప్‌కు వచ్చిన వారి దంతాలను పరీక్షించినపుడు.
ఎక్కువ మంది పిప్పిపళ్లు, చిగుళ్ళ సమస్యలు, పళ్లు ఊగడం మరియు చిగుళ్ల నుంచి రక్తం రావడం వంటి సమస్యలు కనిపించాయి. వీటిని తొలితరం లోనే గుర్తించి వైద్యుడిని సంప్రదించడం వల్ల సమస్యలను నిరోధించవచ్చునన్నారు.
ప్రతి ఆరు నెలలకోసారి దంత పరీక్షలు చేయించుకోవాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామస్థులలో దంత ఆరోగ్యంపై అవగాహన పెరిగింది.
డా. కార్తీక్స్ డెంటల్ హాస్పిటల్ ప్రతి ఆదివారం ఉచిత OPD మరియు X-ray సదుపాయం కూడా అందిస్తున్నట్లు తెలిపారు.
క్యాంప్‌ను విజయవంతం చేసిన పోగుల సారంగపాణి గారికి, గ్రామ పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల్లో నిరంతరం నిర్వహించేందుకు హాస్పిటల్ యత్నిస్తోందని చెప్పారు.
అందరూ దంత ఆరోగ్యంపై మరింత జాగ్రత్తగా ఉండాలని డా. కార్తీక్ తెలిపారు ఈ ఉచిత శిబిరం ద్వారా ప్రజలకు ఆరోగ్య సేవలు అందించడం ఒక మంచి కార్యక్రమంగా నిలిచిందని ఇలాంటి క్యాంప్లు మరింతగా నిర్వహించే అవకాశం ఉందని తెలిపారు.
రిపోర్టర్. ప్రతీప్ రడపాక