telanganadwani.com

JKiranKumar

డ్రగ్స్ డైరెక్టర్ జనరల్‌గా నియమితులైన షాన్ నవాజ్ ఖాసీంను జె. కిరణ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు.

తెలంగాణ ధ్వని : తెలంగాణ రాష్ట్ర డ్రగ్స్ డైరెక్టర్ జనరల్‌గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ఐపీఎస్ అధికారి షాన్ నవాజ్ ఖాసీంను శనివారం రోజు రాష్ట్ర విజిలెన్స్ ఆఫీసర్ మరియు హనుమకొండ, వరంగల్ జిల్లాల డ్రగ్స్ ఇన్స్పెక్టర్ జె. కిరణ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ఆయనకు పూల బొకే అందించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం హనుమకొండ, వరంగల్ జిల్లాలలో డ్రగ్స్ డిపార్ట్మెంట్ నిర్వహణ, ప్రస్తుత పరిస్థితులు, కొనసాగుతున్న కార్యక్రమాలపై వివరాలు తెలియజేశారు.

రిపోర్టర్. ప్రతీప్ రడపాక 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top