telanganadwani.com

Dial100Abuse

తగిన తమాషా అంటే ఇదేనేమో……….

తెలంగాణ ధ్వని : తాగిన తర్వాత మనుషులు వివిధ రకాలుగా చేస్తారు. కానీ వీడు మాత్రం వెరైటీగా ఆలోచించాడు. తాగిన తర్వాత నేరుగా పోలీసులతోనే పెట్టుకున్నాడు.

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 77 సార్లు 100 డయల్ చేసి పోలీసులకు ముప్పుతిప్పలు పెట్టాడు. చివరకు ఈ తాగుబోతును పట్టుకొని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే..

సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం పెద్ద ముబారక్‌పూర్ గ్రామానికి చెందిన నాయకిని సురేష్ అనే వ్యక్తి గత ఆరు నెలల్లో మద్యం మత్తులో 77 సార్లు పోలీస్ ఎమర్జెన్సీ నెంబర్ డయల్ 100కి కాల్ చేశాడు.

అతడు ప్రతీసారి ఊరి పేరు తప్పు చెప్తూ.. తన పేరు వేరుగా చెబుతూ.. తాను చనిపోతున్నానని, భార్య కనిపించడం లేదని, తాను పెట్రోల్ పోసుకున్నానని ఇలా వివిధ అబద్ధాలతో పోలీసుల సేవలను దుర్వినియోగం చేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది.

ఈ చర్యల వల్ల పోలీసులు అవసరమైనవారికి సకాలంలో సహాయం అందించలేకపోతున్న పరిస్థితి ఏర్పడిందని అధికారులు తెలిపారు. ప్రజల భద్రత కొరకు ఏర్పాటు చేసిన డయల్ 100 సేవను అలా దుర్వినియోగం చేయడం నేరమని వారు హెచ్చరించారు.

ఈ నేపథ్యంలో సురేష్‌ను అదుపులోకి తీసుకొని, అతనిపై కేసు నమోదు చేశారు. పోలీసులు ఇదే తరహాలో మరెవరైనా మద్యం మత్తులో లేదా ఉద్దేశపూర్వకంగా డయల్ 100 సేవను దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.

ఫుల్‌గా తాగి గొడవలు పెట్టుకునే వారిని చూశాం కానీ.. ఇలా 100 నెంబర్‌కి ఫోన్లు చేసి పోలీసులను ఇబ్బందులకు గురి చేసిన వీడిని చూసి అందరూ షాక్ అవుతున్నారు.

రిపోర్టర్. ప్రతీప్ రడపాక 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top