తెలంగాణ ధ్వని : ఈ మధ్యన మలయాళంతో పాటు తమిళ్ భాషలోనూ క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ లు తెరకెక్కుతున్నాయి. థియేటర్లలో ఆడియెన్స్ కు సరికొత్త థ్రిల్ ను పరిచయం చేస్తున్నాయి.
తమిళ్ తో పాటు తెలుగులోనూ ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. వివేహేతర సంబంధాల నేపథ్యంలో ఫ్యామిలీ డ్రామాకు కాస్త సస్పెన్స్, క్రైమ్ ఎలిమెంట్స్ జోడించి దర్శకుడు ఈ ను తెరకెక్కించాడు. ఐఎమ్‌డీబీలో ఈ మూవీ 6.1 రేటింగ్‌ను సొంతం చేసుకుంది.
ఈ కథ విషయానికి వస్తే.. అరవింద్, పూర్తిలకు కొత్తగా పెళ్లవుతుంది. ఇద్దరూ కలిసి చెన్నైలో హ్యాఫీ లైఫ్ ను లీడ్ చేస్తుంటారు. అయితే పెళ్ళయిన మూడు నెలలకే భర్త పూరిపై ఆధిపత్యం చెలాయించడం మొదలు పెడతాడు.
వంటింటి కుందేలుగా, తనకు సేవలు మాత్రమే చేసే పని మనిషిగా మారుస్తాడు. అయినప్పటికీ పూరీ పల్లెత్తు మాట అనదు. కానీ ఇక్కడే కథలో కీలక మలుపు వస్తుంది.
అరవింద్‌కు అన్న అనే అమ్మాయితో ఎఫైర్ ఉందనే నిజం పూరీకి తెలుస్తుంది. ఆ తర్వాత కొన్ని రోజులకే అరవింద్ కనిపించకుండాపోతాడు. దీంతో చివరకు ఈ విషయం పోలీస్ స్టేషన్ కు చేరుతుంది.
అరవిద్ కన్పించకుండా పోవడానికి ఆర్థిక సమస్యలే కారణం అనుకుంటారు పోలీసులు. కానీ అన్నాకు మాత్రం పూర్ణిపై అనుమానం వస్తుంది.
మరి అరవింద్ కనిపించకుండాపోవడానికి పూర్ణికి ఎలాంటి సంబంధం ఉంది? అరవింద్ గురించి అన్నకు ఎలాంటి షాకింగ్ విషయాలు తెలిశాయి? అన్నను ప్రేమించిన అరవింద్ పూర్ణిని ఎందుకు పెళ్లిచేసుకున్నాడు?
అసలు అరవింద్ ను పూర్ణినే చంపిందా? ఒకవేళ అదే జరిగి ఉంటే పూర్ణి ఆ శవాన్ని ఏం చేసింది? పోలీసులకు దొరకాకుండా ఎలా తప్పించుకుంది? అనే విషయాలను తెలుసుకోవాలంటే జెంటిల్ వుమన్ చూడాల్సిందే.
ఈ ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీలో జై భీమ్ మూవీ ఫేమ్ లిజోమోల్ జోస్, లోస్లియా మరియనేసన్, హరికృష్ణన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ తో పాటు ఆహా ఓటీటీ, టెంట్‌కోట ఓటీటీల్లోనూ ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. వీకెండ్ లో మంచి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ చూడాలనుకునేవారికి ఇది ఒక మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు.
రిపోర్టర్.ప్రతీప్ రడపాక