తెలంగాణ ధ్వని : కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలోని జనగణన విభాగం విడుదల చేసిన ఒక రిపోర్టులో షాకింగ్ నిజం వెలుగు చూసింది. తెలంగాణ రాష్ట్రంలో లింగ నిష్పత్తి అంతకంతకూ పెరుగుతోందన్న చేదునిజానికి సంబంధించిన గణాంకాల వెల్లడయ్యాయి.
రాష్ట్రంలో ఆడపిల్లల సంఖ్య అంతకంతకూ తగ్గుతోందని వెల్లడైంది.
2019లో ప్రతి వెయ్యి మంది మగ శిశువులకు 953 మంది ఆడ శిశువులు పుడితే.. 2021లో ఆడ శిశువుల సంఖ్య ఆందోళనకర స్థాయికి పడిపోయింది. కేవలం ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు 922 మంది అమ్మాయిలే పుడుతున్న వైనం వెలుగు చూసింది. తెలంగాణ రాష్ట్రంలో జననాల రేటు గ్రామీణ ప్రాంతాల్లో కంటే పట్టణ ప్రాంతాల్లోనే జననాల రేటు ఎక్కువగా ఉన్నట్లు తేలింది.
2021లో గ్రామీణ ప్రాంతాల్లో 1,96,166 మంది పుడితే.. పట్టణ ప్రాంతాల్లో 4,15,485 మంది పుట్టినట్లుగా రిపోర్టు వెల్లడించింది. అదే సమయంలో 2021లో పుట్టిన పిల్లల్లో 3.18 లక్షల మంది మగ శిశువులకు 2.93 లక్షల మంది ఆడ శిశువులు పుట్టినట్లుగా గుర్తించారు. ఇక.. 2021లో కొవిడ్ కారణంగామరణాల సంఖ్య తెలంగాణలో 15.4 శాతం పెరిగిన విషయాన్ని వెల్లడించింది.
2021లో గ్రామీణ ప్రాంతాల్లో 1.08 లక్షల మంది చనిపోతే.. పట్టణ ప్రాంతాల్లో 1.26 లక్షల మంది మరణించారు. 2021లో మొత్తం 2.34 లక్షల మంది చనిపోగా.. అందులో పురుషులు 1.35 లక్షలు కాగా.. మహిళలు 98 వేల మంది ఉన్నారు.