telanganadwani.com

TG RTC

తెలంగాణలో ఆర్టీసీ బస్సులు మే 6న అర్ధరాత్రి నుంచి బంద్: కార్మిక సంఘాలు సమ్మెకు సిద్ధం..

తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు మే 6వ తేదీ అర్ధరాత్రి నుంచి బంద్ అయ్యే అవకాశం ఉంది. ఈ సమ్మెకు సంబంధించి కార్మిక సంఘాలు బస్సులను డిపోలకే పరిమితం చేసే నిర్ణయం తీసుకున్నాయి. ఆర్టీసీ పరిరక్షణ, విలీన ప్రక్రియలను పూర్తి చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం గత జనవరి 27న ఇచ్చిన సమ్మె నోటీసుపై సంస్థ యాజమాన్యం, ప్రభుత్వం మరియు లేబర్ కమిషనర్ నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో, ఈ సమ్మెకు సిద్ధమయ్యారు.

ఇటీవల హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆర్టీసీ జేఏసీ, అన్ని కార్మిక సంఘాలతో కలిసి ఒకే మాట, ఒకే బాటను అనుసరించాలని నిర్ణయించింది. “సమ్మెబాట” అనే లక్ష్యంతో అన్ని కార్మిక సంఘాలు ఐక్యంగా పోరాడాలని నిర్ణయించారు.

జేఏసీ ఈ సమ్మెని మే 7 నుంచి ప్రారంభించాలని సూచించింది. యూనియన్ల మధ్య ఉన్న భిన్నాభిప్రాయాలను విడనాడి, ప్రభుత్వ కుట్రలను తిప్పి, కార్మిక ప్రయోజనాల పరిరక్షణ కోసం ఐక్యంగా పోరాటం చేయాలని కోరింది.

సమ్మెకు సంబంధించిన అన్ని కార్యాచరణలు జేఏసీ నేతృత్వంలోనే జరగనున్నాయి.

రిపోర్టర్.ప్రతీప్ రడపాక 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top