తెలంగాణ ధ్వని : తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల పంపిణీపై వేగం పెంచింది. ఇప్పటికే డిజైన్ సిద్ధం చేసుకుంటున్న అధికార యంత్రాంగం, ఈ సారి రేషన్ కార్డులను స్మార్ట్ కార్డు రూపంలో తీసుకురావాలని నిర్ణయించింది.
కొత్త రేషన్ కార్డుల ప్రత్యేకతలు
రేషన్ కార్డులను ఎటీఎం కార్డు సైజులో రూపొందిస్తున్నారు.
కార్డుపై ఒకవైపు సీఎం బొమ్మ, మరోవైపు పౌర సరఫరాల శాఖ మంత్రి బొమ్మ ఉండనుంది.
మధ్యలో తెలంగాణ ప్రభుత్వ అధికారిక లోగో ఉంటుంది.
కుటుంబ సభ్యుల ఫోటో పెట్టాలా? లేక వారి పేర్లు, ఇతర వివరాలు చేర్చాలా? అనే అంశంపై అధికారులు ఇంకా ఆలోచనలో ఉన్నారు.
వెనుకవైపు చిరునామా, రేషన్ షాప్ నెంబర్, ఇతర వివరాలు ముద్రించనున్నారు.
తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని ఆధునిక రేషన్ కార్డు విధానాన్ని తెలంగాణలో కూడా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.రేషన్ కార్డుల పంపిణీకి ఏర్పాట్లు
ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో ముందుగా పంపిణీ చేపట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
రేషన్ కార్డుల తయారీకి షార్ట్ టెండర్లు పిలిచేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
కులగణన, ప్రజాపాలన, ప్రజావాణి, మీ సేవా కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 4 రకాలుగా దరఖాస్తులు స్వీకరించారు.ప్రజలు ఎక్కడైనా ఒకసారి దరఖాస్తు చేస్తే చాలని, మళ్లీ అప్లై చేయాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు.
రిపోర్టర్. ప్రతీప్ రడపాక