తెలంగాణ ధ్వని : తెలంగాణ (Telangana)ను డ్రగ్స్ ఫ్రీ స్టేట్ (Drugs Free State)గా చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ ఫుల్ ఫోకస్ పెట్టింది. ఈ మేరకు డ్రగ్స్ విక్రయిస్తూ..
ఎవరైనా పట్టుబడిన వారి పట్ల కఠినంగా వ్యవహరించాలంటూ పోలీసు శాఖ (Police Department)కు ఆదేశాలను జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే టాస్క్‌ఫోర్స్ (Taskforce), ఎస్ఓటీ (SOT), ఇతర పోలీసు సిబ్బంది రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. తాజాగా, సంక్రాంతి (Sankranti) పండుగ నేపథ్యంలో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు (Railway Stations), ఎయిర్‌పోర్టు(Airports)లు, పట్టణాల్లోని ప్రధాన కూడళ్లలో వాహనాలను ఆపి క్షుణ్ణంగా తనిఖీలు చేపడుతూ.. ఎక్కడికక్కడ గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణాను అడ్డుకుని కేసులు నమోదు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే డ్రగ్స్ (Drugs) అమ్ముతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్‌వోటీ పోలీసులు (SOT Police) ఎల్బీ నగర్ (LB Nagar)లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ మేరకు యువతకు డ్రగ్స్ అమ్ముతున్న అజయ్, జైపార్ రాజ్, రిక్కి, రాజులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, వారంతా డ్రగ్స్‌ను బెంగళూరు (Bengaluru) నుంచి తీసుకొచ్చి గుట్టుచప్పుడు కాకుండా నగరంలో విక్రయిస్తున్నట్లుగా ప్రాథమిక విచారణలో తేలింది. ఈ మేరకు నిందితుల నుంచి నిషేధిత డగ్స్, కారు, నాలుగు సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
రిపోర్టర్.ప్రతీప్ రడపాక