తెలంగాణ ధ్వని: తెలంగాణ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలల్లో నేటి నుండి ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట తరగతులు నిర్వహించనున్నారు.
తరగతులు ఉదయం 8:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు మాత్రమే జరుగుతాయి. అయితే, 10వ తరగతి పరీక్షలు జరుగుతున్న పరీక్ష కేంద్రాల్లో మాత్రం మధ్యాహ్నం తరగతులు కూడా కొనసాగుతాయి.
తెలంగాణ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఊహించని రీతిలో పెరుగుతూ, ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో 38-40 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని విద్యాశాఖ ఒంటిపూట బడుల నిర్ణయం తీసుకుంది.
ఇది ముఖ్యంగా ప్రాధమిక మరియు ఉన్నత పాఠశాలల విద్యార్థులకు ఉపశమనం కలిగించే చర్యగా చెప్పుకోవచ్చు. ఉదయం వేళ లోనే చదువు పూర్తి చేయడం వలన ఉష్ణోగ్రత పెరుగే మధ్యాహ్న సమయంలో పిల్లలు ఇళ్లకు చేరుకుంటారు. ఇది విద్యార్థుల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
10వ తరగతి పరీక్షలు జరుగుతున్న కేంద్రాల్లో మాత్రం మధ్యాహ్నం తరగతులు కొనసాగుతుండటంతో, అక్కడ విధిగా ఏర్పాట్లు, నీటి సదుపాయాలు, విద్యార్థుల సురక్షిత వాతావరణంపై అధికారులు మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.
తల్లిదండ్రులకు సూచనలు:
– పిల్లలకు తగినంత నీరు, శీతల పానీయాలు అందుబాటులో ఉంచండి
– మితంగా ఆహారం ఇవ్వండి, వేడి వేళ దాహం తీరించే పదార్థాలు ప్రాధాన్యం ఇవ్వండి
– స్కూల్ యూనిఫాం కాస్త పలుచగా, హావాయిలాగా ఉండేలా చూసుకోవాలి
– స్కూల్ నుండి తిరిగి వచ్చిన వెంటనే శరీరానికి విశ్రాంతి ఇవ్వాలి
విద్యాశాఖ తీసుకున్న ఈ నిర్ణయం, సమయాలకు అనుకూలమైందనే అభిప్రాయాన్ని చాలా మంది తల్లిదండ్రులు వ్యక్తం చేస్తున్నారు. వేసవిలో పిల్లల ఆరోగ్యమే ముఖ్యమన్న దృష్టితో ప్రభుత్వం ఈ చర్యలు తీసుకోవడం శోచనీయం.
రిపోర్టర్: కిరణ్ సంగ…