తెలంగాణ ధ్వని : తెలంగాణ రాష్ట్రంలో పోలీసు శాఖలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. 21 మంది ఐపీఎస్ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం స్థాన చలన నిర్ణయం తీసుకుంది. బదిలీ అయిన అధికారుల్లో ఒక అదనపు డీజీ, ఇద్దరు ఐజీలు, ఇద్దరు డీఐజీలు ఉన్నారు. అదనంగా ఇద్దరు నాన్ క్యాడర్ ఎస్పీలకు సైతం కొత్త పోస్టింగ్‌లు ఇచ్చారు. మొత్తం 14 మంది ఎస్పీలను బదిలీ చేశారు.
కొత్తగా బాధ్యతలు స్వీకరించిన అధికారులు:
కరీంనగర్ పోలీస్ కమిషనర్‌గా – గౌస్ ఆలం
అదనపు డీజీ (పర్సనల్)గా – అనిల్ కుమార్ (ఎస్పీఎఫ్ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు)
సీఐడీ డీజీగా – ఎం.శ్రీనివాసులు
వరంగల్ పోలీస్ కమిషనర్‌గా – సన్‌ప్రీత్ సింగ్
నిజామాబాద్ పోలీస్ కమిషనర్‌గా – సాయి చైతన్య
రామగుండం పోలీస్ కమిషనర్‌గా – అంబర్ కిషోర్
ఇంటెలిజెన్స్ ఎస్పీగా – సింధు శర్మ
భువనగిరి డీసీపీగా – అకాంక్ష యాదవ్
మహిళా భద్రతా విభాగం ఎస్పీగా – చేతన
నార్కోటిక్ బ్యూరో ఎస్పీగా – రూపేష్
కామారెడ్డి ఎస్పీగా – రాజేష్ చంద్ర
సంగారెడ్డి ఎస్పీగా – పారితోష్ పంకజ్
ఈ బదిలీలపై పోలీసు శాఖలో విశేషమైన చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ఒక్కసారిగా 21 మంది అధికారులను బదిలీ చేయడం ప్రాముఖ్యత సంతరించుకుంది. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన పోలీసు అధికారులు తమ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలపై దృష్టి సారించనున్నారు.
రిపోర్టర్. ప్రతీప్ రడపాక