తెలంగాణ ధ్వని : జోగులాంబ ఆలయం తెలంగాణలో వుంది. బలం, రక్షణకు చిహ్నమైన దుర్గమ్మ తల్లి రూపం జోగులాంబది. తెలంగాణ రాష్ట్రంలోని అలంపూర్‌లో ఉన్న ఈ ఆలయం మహా శక్తిపీఠాలలో ఒకటి.
ఇది తుంగభద్ర. కృష్ణ నదుల సంగమం వద్ద ఉంది. నల్లమల కొండలతో చుట్టుముట్టబడి ఉంది.ఇది క్రీ.శ. ఏడవ శతాబ్దంలో చాళుక్య రాజవంశం పాలనలో ఈ ఆలయం నిర్మించబడింది. ఈ ఆలయంలో శివులు, విష్ణవులు వుంటారు. అద్భుతమైన నిర్మాణ నైపుణ్యాన్ని ప్రదర్శించే తొమ్మిది దేవాలయాల సమూహం ఈ ఆలయం గొప్పతనం.
అందుకే దీనిని దక్షిణ కైలాసం అని కూడా పిలుస్తారు. నేటి అలంపూర్‌లో వేలాది సంవత్సరాలుగా బ్రహ్మ గొప్ప తపస్సు చేశాడని కూడా చెబుతారు.
పరమపావనమైన ఆలంపూర్ క్షేత్రంలో జోగులాంబ అమ్మవారు పీఠాసన రూపంలో మహా తేజోవంతమై దర్శనమిస్తారు. కేశాలు గాలిలో తేలుతున్నట్లు ఉండి, వాటిలో బల్లి, తేలు, గబ్బిలం, కపాలం వంటివి కనిపిస్తాయి.
ఎవరి ఇంట్లో అయినా జీవకళ తగ్గితే అక్కడ బల్లుల సంఖ్య పెరుగుతుందని, ఆ కళ మరింత క్షీణిస్తే అక్కడికి తేళ్లు చేరుతాయని, దీని సారాంశం.
రిపోర్టర్. ప్రతీప్ రడపాక