telanganadwani.com

Warangal

దీప్తి ఆర్‌ గీతం విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డి డిగ్రీ సాధించించారు..

తెలంగాణ ధ్వని : గీతం  స్కూల్ ఆఫ్ ఫార్మసీ, విశాఖపట్నం నుండి పరిశోధనాకర్త దీప్తి ఆర్ (రిజిస్ట్రేషన్ నెంబర్: 121965201013) గారు డాక్టరేట్ డిగ్రీకి అర్హత సాధించారు.

ఆమె “అడెనైన్ కారణంగా కలిగే దీర్ఘకాలిక మూత్రపిండ నష్టం మరియు హృద్రోగ మార్పులపై నైసర్గిక సమ్మేళనాల రక్షణాత్మక ప్రభావాల మూల్యాంకనం – TGF-β1 మరియు Caspase 3 లక్ష్యంగా” అనే శీర్షికతో పిహెచ్.డి. పరిశోధన సమర్పించారు.

ఈ పరిశోధన డాక్టర్ జి సుహాసిన్ గారి సూచనల ప్రకారం పూర్తయింది. దీప్తి ఆర్ వరంగల్‌కు చెందిన వారు, ప్రస్తుతం హనుమకొండ జిల్లా ఒగ్లాపూర్‌లోని కేర్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా సేవలందిస్తున్నారు.

ఆమెకు గీతం విశ్వవిద్యాలయం ప్రో వైస్ ఛాన్సలర్ గౌతమరావు యెజ్జు, రిజిస్ట్రార్ గుణశేఖరన్ డీ, ఫార్మసీ డీన్ డాక్టర్ జగత్తరన్ దాస్, మరియు విశాఖపట్నం క్యాంపస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎల్. శ్రీనివాస్ తరఫున అభినందనలు తెలిపారు.

రిపోర్టర్. ప్రతీప్ రడపాక 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top