తెలంగాణ ధ్వని: తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి పిలుపునందుకొని, చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం గారు దేశ రక్షణ నిధికి తన ఒక నెల వేతనాన్ని విరాళంగా ప్రకటించారు.
దేశానికి సేవ చేస్తున్న భారత సైనికులకు మద్దతుగా నిలవాల్సిన సమయం ఇదేనని ఆయన పేర్కొన్నారు. సరిహద్దుల్లో పాక్ ముష్కరుల నుంచి దేశాన్ని కాపాడుతున్న భారత ఆర్మీ వీర జవాన్ల ధైర్యానికి సెల్యూట్ చేస్తున్నానని తెలిపారు.
ఘటనలో అమాయక పౌరుల ప్రాణాలు పోయిన తీరును ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ దాడికి భారత ఆర్మీ “ఆపరేషన్ సింధూర్” ద్వారా గట్టి బదులు ఇచ్చిందని అభినందించారు.
దేశ రక్షణ కోసం పోరాటం చేస్తున్న ఆర్మీకి సంఘీభావం తెలుపడం ప్రతి పౌరుడి కర్తవ్యమన్నారు. ముఖ్యమంత్రి పిలుపు మేరకు ప్రజాప్రతినిధులుగా ముందుగా తానే ముందడుగు వేసినట్టు తెలిపారు.
ఈ చర్య ఇతర ప్రజాప్రతినిధులకు, పౌరులకు ప్రేరణగా మారుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. చొప్పదండి నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తమకు తోచినంతగా విరాళాలు అందించాలని పిలుపునిచ్చారు.
సైన్యం ధైర్యం, త్యాగం ప్రపంచానికి ఆదర్శమని అన్నారు. ఈ విరాళాలు ఆర్మీ మౌలిక వసతుల అభివృద్ధికి తోడ్పడతాయని పేర్కొన్నారు. దేశ భద్రత కోసం పని చేయడం కేవలం ఆర్మీ కాదు, ప్రతి పౌరుడి బాధ్యతనూ అన్నారు.
భారత సైన్యం మన గర్వకారణమని, వీరులకు మద్దతు తెలపడం మన సంస్కృతిలో భాగమన్నారు. దేశ రక్షణ కోసం ప్రాణాలు ఇచ్చే జవాన్లకు మనం చేసే చిన్న సహాయం కూడా ఎంతో విలువైనదని చెప్పారు.
అవసరమైతే భవిష్యత్తులో మరింత సహకారం అందించేందుకు తాను సిద్ధమన్నారు. దేశానికి అండగా ఉండే వాతావరణాన్ని ప్రతి ఒక్కరూ సృష్టించాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా “నేను భారతీయుడిని – నా ఆర్మీకి మద్దతుగా నిలుస్తాను” అంటూ అభిమానం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికులు, యువత కూడి దేశ రక్షణ నిధికి తోచిన విధంగా విరాళాలు అందించాలన్నారు.
ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్‌కు భారత్ ఇచ్చిన సమాధానం గర్వకారణమని తెలిపారు. భారత ఆర్మీ చేస్తున్న సేవలు దేశ గర్వంగా నిలుస్తున్నాయని అన్నారు. దేశ రక్షణ కోసం చేస్తున్న ఈ చర్యల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలన్నారు.
రిపోర్టర్. ప్రతీప్ రడపాక