ప్రభుత్వం ధరణి వ్యవస్థకు బదులుగా కొత్తగా భూభారతి-2025 చట్టాన్ని తీసుకొచ్చింది.
ఈ చట్టం ద్వారా అక్రమ పట్టాలు ఉన్న భూములకు హక్కుల రికార్డుల్లో సవరణకు అవకాశం కల్పించనున్నారు.
భూముల మ్యుటేషన్, రిజిస్ట్రేషన్ కోసం ముందుగా సర్వే, మ్యాపింగ్ తప్పనిసరి చేసింది.
భూమి రికార్డులపై తప్పుల సవరణకు రెండు స్థాయుల్లో అప్పీల్ అవకాశం కల్పించనున్నారు.
తెలంగాణ ధ్వని : తెలంగాణ ప్రభుత్వం భూ పరిపాలనలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. ధరణికి బదులుగా భూభారతి-2025 చట్టాన్ని తీసుకొచ్చింది.ఈ చట్టం ప్రకారం, హక్కుల రికార్డుల్లో సరైన వివరాలు నమోదు కావడం లక్ష్యంగా ఉంది.అక్రమంగా ఉన్న ప్రభుత్వ,దేవాదాయ, వక్ఫ్, భూదాన్, అసైన్డ్ భూములపై పట్టాల రద్దు ప్రక్రియ చేపట్టనున్నారు.ఇకపై ఎలాంటి భూ లావాదేవీలు నమోదు అయ్యే ముందు మ్యాపింగ్, సర్వే తప్పనిసరి.భూములకు సంబంధించి వివరాలు భూభారతి పోర్టల్ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంటాయి.పాస్‌బుక్ లో భూమి పటాలు, టైటిల్ డీడ్ కూడా ఇవ్వనున్నారు.ప్రభుత్వం జారీ చేసే హక్కుల పత్రాల్లో ఆధునిక టెక్నాలజీని ఉపయోగించనుంది.ఒకసారి నమోదు అయిన రికార్డుల్లో మార్పులు జరగాలంటే అధికారుల అనుమతి తప్పనిసరి.వారసత్వ భూములకు మ్యుటేషన్ ప్రక్రియ మరింత సులభతరం కానుంది.రెండు దశల్లో అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించారు మొదట తహసీల్దార్, తరువాత ఆర్డీవో.వివాదాస్పద భూముల విషయంలో కలెక్టర్ స్థాయిలో విచారణ జరగనుంది.
ఇప్పటికే భూములపై ఉన్న వివాదాల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోనున్నారు.సాంకేతిక దోషాలతో రికార్డుల్లో వచ్చిన పొరపాట్లు సవరించేందుకు అవకాశం ఉంది.ప్రతి రైతుకు భూమి సమాచారం సులభంగా లభించేలా విధానం రూపొందించనున్నారు.నకిలీ పత్రాల వల్ల జరిగే మోసాలను అరికట్టే విధంగా సిస్టమ్‌ను రూపొందించారు.వాస్తవిక భూహక్కులను లబ్ధిదారులకు కల్పించడమే ప్రధాన ఉద్దేశ్యం.రెవెన్యూ శాఖ, రిజిస్ట్రేషన్ శాఖ మధ్య సమన్వయం పెరుగుతుంది.ఇది భూసంబంధిత కేసుల తగ్గింపుకు దోహదం చేయనుంది.
పౌరులకు పారదర్శక, సులభమైన భూ పరిపాలన అందించే దిశగా ఇది ఒక కీలక అడుగు.
రిపోర్టర్. ప్రతీప్ రడపాక