తెలంగాణ ధ్వని : తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన తెలంగాణ గురుకుల సెట్ ఫలితాలలో నర్సంపేట షైన్ గ్రూప్ కోచింగ్ సెంటర్ విద్యార్థులు అద్భుత ప్రతిభను ప్రదర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా పోటీ నెలకొన్న ఈ పరీక్షలో షైన్ కోచింగ్ విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించి, తమ ప్రతిభను నిరూపించుకున్నారు.
తిప్పారపు భవ్య శ్రీ రాష్ట్రస్థాయిలో 54వ ర్యాంకు, జిల్లా స్థాయిలో బాలికల విభాగంలో 1వ ర్యాంకు సాధించి గొప్ప ప్రదర్శన ఇచ్చింది. అలాగే, ఉట్కూరు లక్కీ రాష్ట్రస్థాయిలో 113వ ర్యాంకు, జిల్లా స్థాయిలో 3వ ర్యాంకు సాధించి తన విద్యాసామర్థ్యాన్ని చాటుకుంది. మరో విద్యార్థి రాష్ట్రస్థాయిలో 276వ ర్యాంకు, జిల్లా స్థాయిలో 8వ ర్యాంకు సాధించి మెరిసింది.
విద్యార్థుల ఈ విజయాన్ని పురస్కరించుకుని షైన్ గ్రూప్ మేనేజ్‌మెంట్ వారు విజేతలను ఘనంగా సత్కరించారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు వారిని అభినందిస్తూ, వారి భవిష్యత్తుకు శుభాకాంక్షలు తెలియజేశారు. క్రమశిక్షణ, కృషి, అద్భుతమైన గైడెన్స్ ద్వారా విద్యార్థులు ఈ స్థాయికి చేరుకున్నారని, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని మేనేజ్‌మెంట్ ఆకాంక్షించింది.
రిపోర్టర్. దీప్తి