తెలంగాణ ధ్వని : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నామినేటెడ్ పదవుల భర్తీపై కసరత్తు ప్రారంభించారు. పార్టీలోని నేతలను మూడు కేటగిరీలుగా విభజించారు.
- మొదటి నుంచి కాంగ్రెస్‌లోనే ఉన్నవారు ఒక గ్రూపు
- ఎన్నికలకు ముందు ఇతర పార్టీల నుంచి వచ్చినవారు రెండో గ్రూపు
- అధికారంలోకి వచ్చాక పార్టీలో చేరినవారు మూడో గ్రూపు
పార్టీ పదవులు, నామినేటెడ్ పదవుల భర్తీలో ఈ కేటగిరీల వారీగా ప్రాధాన్యత ఇవ్వనున్నారు. పదేళ్లు పార్టీలో ఉన్నవారి జాబితాను మీనాక్షి నటరాజన్ కోరారు. మొదటి నుంచి పార్టీలో ఉన్నవారికే ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిసింది.రాష్ట్ర కాంగ్రెస్ పనితీరుపై ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. లోక్‌సభ నియోజకవర్గాల వారీగా పార్టీ నేతలతో సమావేశమవుతున్నారు. ”ఎవరి పనితీరు ఏమిటో నాకు తెలుసు. ఎవరు పనిచేస్తున్నారో, ఎవరు నటిస్తున్నారో తెలుసు. పార్టీ కోసం సమయం కేటాయించాలి. అంతర్గత విషయాలు బయట చర్చించొద్దు” అని ఆమె హెచ్చరించారు.
రిపోర్టర్. ప్రతీప్ రడపాక