– ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
తెలంగాణ ధ్వని : వరంగల్ జిల్లా డెయిరీ రంగ అభివృద్ధికి దోహదపడే విధంగా రూ.25 కోట్ల వ్యయంతో నూతన విజయ డెయిరీ యూనిట్‌ను నిర్మించేందుకు ప్రభుత్వ స్థాయిలో చురుకైన ప్రయత్నాలు కొనసాగుతున్నాయని.
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు. శనివారం విజయ డెయిరీ వరంగల్ యూనిట్‌లో పాలు, పెరుగు ఉత్పత్తుల కోసం నూతన ప్యాకింగ్‌ను మార్కెట్‌లో విడుదల చేసే కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సమాఖ్య సంస్థ (టీఎస్‌డీడీసీఎఫ్) చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, వరంగల్ ఎంపీ డాక్టర్ కావ్య, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
నూతన ప్యాకింగ్ రూపకల్పనలో నాణ్యతకు ప్రాధాన్యం ఇస్తూ వినియోగదారుల విశ్వాసాన్ని మరింత బలపరిచేలా ఉత్పత్తులను విడుదల చేయడం జరిగిందని వారు తెలిపారు.
ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ, విజయ డెయిరీ అంటే ప్రజల్లో నమ్మకం ఉన్న బ్రాండ్‌గా నిలిచిందన్నారు. నాణ్యమైన పాలను అందించడంలో విజయ డెయిరీ పేరుగాంచిందని,
వ్యవసాయదారులకు మద్దతుగా నిలిచే విధంగా దీనిని మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని అన్నారు. నూతన డెయిరీ యూనిట్ ఏర్పాటుకు వరంగల్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులంతా కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలసి నిధుల కోసం కృషి చేస్తామని తెలిపారు.
విజయ డెయిరీ ఆధ్వర్యంలో నాణ్యమైన ఉత్పత్తులతోపాటు డిజిటల్ మార్కెటింగ్, సరఫరా వ్యవస్థలను మరింత మెరుగుపరచాలన్న దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు డెయిరీ అధికారి మల్లయ్య తెలిపారు.
మార్కెట్‌లో పోటీ day by day పెరుగుతున్న నేపథ్యంలో విజయ డెయిరీ ప్యాకేజింగ్, బ్రాండింగ్ విషయంలో ఆధునికతను వాడకంలో ముందు ఉంటుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో డెయిరీ జీఎంలు మధుసూదన్ రావు, రీజనల్ సేల్స్ మేనేజర్ ధన్‌రాజ్, డిప్యూటీ డైరెక్టర్లు శ్రవణ్ కుమార్, సత్యనారాయణ, జూనియర్ మేనేజర్ అశోక్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
వీరు విజయ డెయిరీ ప్రస్థానాన్ని వివరించారు. ప్రస్తుతం వరంగల్, జనగామ జిల్లాల్లో విజయ డెయిరీకి మంచి ఆదరణ ఉందని తెలిపారు.
రిపోర్టర్. ప్రతీప్ రడపాక