తెలంగాణ ధ్వని : గుడుంబా నిర్మాణం, విక్రయంపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. వరంగల్ జిల్లాలో ఎక్సైజ్ పోలీసులు చేపట్టిన ఈ దాడులు అక్రమ మద్యం వ్యాపారాన్ని నిరోధించేందుకు కీలకమైనవి.
నెక్కొండ మండలం మహబూబ్ నాయక్ తండాలో గుడుంబా నిల్వలపై పక్కా సమాచారం ఆధారంగా నర్సంపేట ఎక్సైజ్ సీఐ నరేష్ రెడ్డి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించడంతో, అక్రమంగా నిల్వ ఉంచిన చక్కెర పానకం ధ్వంసం చేయడం జరిగింది. ఇకపై గుడుంబా తయారీ, అమ్మకాలపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
ఇలాంటి దాడులు ఎప్పటికప్పుడు కొనసాగిస్తామని ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. గుడుంబా వంటి నిషేధిత పదార్థాల వాడకం వల్ల ఆరోగ్యానికి కలిగే నష్టాన్ని ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు, అక్రమ వ్యాపారులపై శిక్షలు అమలు చేస్తామని స్పష్టం చేశారు.
స్థానిక ప్రజలు కూడా తమ సమీప ప్రాంతాల్లో ఇలాంటి అక్రమ కార్యకలాపాల గురించి అధికారులకు సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
రిపోర్టర్. దీప్తి