telanganadwani.com

ప్రతి పౌరుడికి అందుబాటులో న్యాయ వ్యవస్థ

న్యాయ వ్వవస్థ పట్ల ప్రజా విశ్వాసం, సంరక్షణకు కృషి చేయాలి – రాష్ట్ర హై కోర్టు జడ్జి & జడ్జి జస్టిస్ కే. లక్ష్మణ్

తెలంగాణ ధ్వని : న్యాయ వ్యవస్థ పట్ల ప్రజలకు ఉన్న నమ్మకాన్ని సంరక్షించే దిశగా మనమంతా కృషి చేయాలని రాష్ట్ర హై కోర్టు జడ్జి & పెద్దపెల్లి జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ కే. లక్ష్మణ్ అన్నారు.
ఆదివారం ఓదెల మండలంలో   నూతనంగా ఏర్పాటు చేసిన జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆవిష్కరించేందుకు రాష్ట్ర హై కోర్టు జడ్జి & పెద్దపెల్లి జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ కే. లక్ష్మణ్, హై కోర్టు జడ్జీలు ఎన్.వి. శ్రావణ్ కుమార్, ఈ.వి.వేణు గోపాల్ , జే. శ్రీనివాస్ రావు లతో కలిసి విచ్చేశారు.
రాష్ట్ర హైకోర్టు  జడ్జిలకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీతా కుంచాల, జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా, సుల్తానాబాద్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్  ఎం.తిరుపతి రెడ్డిలు స్వాగతం పలకగా, పండితులు వేదమంత్రాల మధ్య పూర్ణ కుంభంతో  స్వాగతం పలికారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం రాష్ట్ర హైకోర్టు జడ్జి  జూనియర్ సివిల్ జడ్జి కోర్టును ప్రారంభించి సర్వమత ప్రార్థనలు నిర్వహించారు.
 *రాష్ట్ర హై కోర్టు జడ్జి & పెద్దపెల్లి జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ కే. లక్ష్మణ్ మాట్లాడుతూ,  ఓదెల మండలంలో జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు ఏర్పడటం చారిత్రాత్మిక అంశమని, దీని వల్ల ప్రజల సమీపంలో న్యాయం అందే అవకాశాలు మెరుగవుతాయని అన్నారు.
పెద్దపల్లి జిల్లాలోని అన్ని కోర్టుల పరిధిలో  అనేక కేసులు పెండింగ్ లో ఉన్నాయని, న్యాయవ్యవస్థలో ఉన్న పెండింగ్ కేసుల పరిష్కారానికి  మౌలిక వసతుల మెరుగుదల, నూతన కోర్టుల ఏర్పాటు వంటి చర్యలు తీసుకుంటున్నామని , న్యాయవాదులు, ప్రజలు సైతం సహకరించాలని ఆయన కోరారు.
న్యాయ వ్యవస్థలో రూల్ ఆఫ్ లా అందరికీ సమానంగా అమలు కావాలని, సమాజంలోని ప్రతి పౌరునికి, వెనుకబడిన వర్గాల ప్రజలకు సమాంతరంగా న్యాయ సేవలు తప్పనిసరిగా అందాలని  తెలిపారు. న్యాయ వ్యవస్థ పట్ల ప్రజలకు ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకునే దిశగా మనమంతా సమిష్టిగా పనిచేయాలని, కోర్టులో న్యాయవాదులు,  జడ్జిల ప్రవర్తన మార్గదర్శకాలు మేరకు మర్యాద పూర్వకంగా ఉండాలని ఆయన సూచించారు.*
ఓదెల మండలంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్టు భవనాన్ని  తయారు చేసేందుకు సహకరించిన జిల్లా కలెక్టర్, అధికార యంత్రానికి హై కోర్టు జడ్జి అభినందనలు తెలిపారు.

#న్యాయవ్యవస్థ, #జడ్జికేలక్ష్మణ్, #పెద్దపల్లి, #ఓదెల, #జూనియర్‌సివిల్‌కోర్టు, #తెలంగాణన్యాయవ్యవస్థ, #చారిత్రాత్మకసంఘటన, #సమాజానికిన్యాయం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top