తెలంగాణ ధ్వని : ఉర్సు ప్రాంతంలోని దీప్తి భారత్ పరపతి సంఘాల సంయుక్త సమావేశం ఈరోజు ఘనంగా జరిగింది. 40వ డివిజన్ కార్పొరేటర్ శ్రీ మరుపల్ల రవి గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేటి రోజుల్లో ఆర్థికంగా వెనుకబడినవారికి పరపతి సంఘాలు ఎంతో మేలు చేస్తున్నాయని పేర్కొన్నారు. పరపతి సంఘాలు సభ్యుల వ్యక్తిగత నమ్మకంతో ఎటువంటి గ్యారెంటీలు లేకుండా తక్కువ వడ్డీతో రుణాలను మంజూరు చేస్తున్నాయని తెలిపారు.
రుణం తీసుకున్న వారు గడువు ప్రకారం చెల్లిస్తే పరపతి సంఘాలు ఆర్థికంగా మరింత బలపడతాయని అభిప్రాయపడ్డారు. పరపతి సంఘాల ద్వారా పొందిన రుణాలతో ఇంటి అవసరాలు తీర్చడమే కాకుండా చిన్న చిన్న వ్యాపారాలు కూడా ప్రారంభించవచ్చని, అంతేకాకుండా ఇంటి నిర్మాణం, పిల్లల పెళ్లిళ్లు వంటి అవసరాల కోసం ఎంతోమందికి ఈ రుణాలు ఉపయోగపడుతున్నాయని వివరించారు.
ఈ కార్యక్రమంలో పరపతి సంఘం గౌరవ అధ్యక్షులు బూర కృష్ణమూర్తి, అధ్యక్షులు గోపు సాగర్, వలస రాజమల్లు, ప్రధాన కార్యదర్శి ఎం.డి. యాకూబ్, ఉపాధ్యక్షులు తుమ్మ రమేష్ బాబు, సహాయ కార్యదర్శి ఓడపల్లి అజయ్ బాబు,
కోశాధికారి ఎం.డి. కాజా పాషా, ఎం.డి. మోహినుద్దీన్, ఎం.డి. మక్బూల్, ఆఫీజ్, ఎం.డి. ఫక్రుద్దీన్, బూర ప్రమోద్ కుమార్, కందగట్ల రవి, దిద్దిరాజు, ఎం.డి. జమీల్, ఎం.డి. యాకూబ్ షరీఫ్, ఎం.డి. యూసుఫ్ (తబ్బు) తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్. ప్రతీప్ రడపాక