తెలంగాణ ధ్వని : ఇటీవల కర్ణాటక రాష్ట్రంలోని బాగల్కోటలోని నవనగరలో జరిగిన ఒక అరుదైన సంఘటన అందరినీ ఆశ్చర్యపరచింది. 10వ తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయిన అభిషేక్ కు అతని తల్లిదండ్రులు సాధారణంగా ఉండే పరిణామాలకు భిన్నంగా ప్రోత్సాహం ఇచ్చారు.
ఫలితాల్లో అభిషేక్ ఆరు సబ్జెక్టులలో విఫలమయ్యాడు, 600 మార్కులలో కేవలం 200 మార్కులు మాత్రమే సాధించాడు. అయితే, అలా ఫెయిల్ అయిన అభిషేక్ తల్లిదండ్రులు తీవ్రంగా మండిపడటం లేదా చింతించి ఏమీ చేయడం కాకుండా, తన కుమారునితో కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ నిర్వహించారు.
అభిషేక్ తల్లిదండ్రులు తన కొడుకును ఈ ఫెయిల్‌ను ఓ సాధారణ పరిస్థితిగా తీసుకోవాలని చెప్పారు. “ఫెయిల్ అయినంత మాత్రాన జీవితంలో ముగింపు కాదు. రాబోయే సంవత్సరాల్లో మరిన్ని అవకాశాలు ఉన్నాయి” అని వారు ప్రోత్సహించారు.
అభిషేక్ తల్లిదండ్రుల ఈ ఆదర్శప్రాయమైన ప్రవర్తనతో, పిల్లల ఫెయిల్ కావడం విషాదంగా కాకుండా ఒక భాగ్యంగా చూడాలని సందేశం ఇచ్చారు.
ఇది నేటి కాలంలో పిల్లలపై తల్లిదండ్రుల ప్రవర్తనను మార్చే కొత్త దృక్పథాన్ని సూచిస్తున్న విషయం. పిల్లలు ఆత్మహత్య ఆలోచనలు చేయకుండా, వారిని ప్రోత్సహించడం ద్వారా సానుకూల మార్పులు తీసుకురావచ్చు. ఈ సంఘటన ఒక స్ఫూర్తిగా నిలిచింది.
రిపోర్టర్.ప్రతీప్ రడపాక