telanganadwani.com

CMReliefFund

బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి సహాయం – సీఎం సహాయ నిధి నుండి రూ.2 లక్షల ఎల్.ఓ.సి మంజూరు…

తెలంగాణ ధ్వని : జఫర్‌ఘడ్ మండలం ఉప్పుగల్ గ్రామానికి చెందిన ఎర్రం ఐలయ్య గారి భార్య పద్మగుండె సంబంధిత వ్యాధితో బాధపడుతుండటంతో, మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చేర్చారు.

వారి ఆర్థిక స్థితి దృష్టిలో ఉంచుకొని, కాంగ్రెస్ నాయకుడు యాట అశోక్ గారు ఈ విషయాన్ని ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారి దృష్టికి తీసుకెళ్లారు.శ్రీహరి గారు స్పందించి, ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి రూ.2,00,000 విలువైన ఎల్.ఓ.సి మంజూరు చేయించారు.

ఈ ఎల్.ఓ.సి పత్రాన్ని ఆయన  హనుమకొండలోని తన నివాసంలో బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.ఆర్థికంగా వెనుకబడిన వారికి ప్రభుత్వం ఇచ్చే సహాయం ఎంతో ఉపయోగకరమని ఆయన పేర్కొన్నారు.పేద ప్రజలకు అవసరమైన సమయంలో అండగా నిలబడటం ప్రజా ప్రతినిధుల బాధ్యత అని తెలిపారు.

ఈ సందర్భంలో కాంగ్రెస్ నాయకులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.కడియం శ్రీహరి గారి  సహకారానికి బాధిత కుటుంబం కృతజ్ఞతలు తెలిపారు.

రిపోర్టర్. ప్రతీప్ రడపాక 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top