తెలంగాణ ధ్వని : బిఆర్ఎస్ పార్టీ ఏర్పడి 25 ఏళ్లు నిండాయి. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా 2001 ఏప్రిల్ 27న ఏర్పడింది. బీఆర్ఎస్ ఆవిర్భవించి రేపటికి 25 ఏళ్లు పూర్తి కావడంతో వరంగల్ లో భారీ సభ నిర్వహిస్తున్నారు
సభ ఏర్పాట్లలో భారీ ఏర్పాట్లు
ఈ సభను బీఆర్ఎస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని, తన బలం దేశానికి చూపించాలనే లక్ష్యంతో భారీ ఏర్పాట్లు చేసింది. పార్కింగ్ కోసం 1,059 ఎకరాలను కేటాయించగా, 2,000 మంది వాలంటీర్లు ట్రాఫిక్ నిర్వహణలో సహాయపడనున్నారు. కరెంట్ లోపం జరగకుండానే సభ కొనసాగించేందుకు 250 జనరేటర్లను ఏర్పాటు చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలను తరలించేందుకు 3,000 ఆర్టీసీ బస్సులు, వేల సంఖ్యలో ప్రైవేట్ వాహనాలను కూడా సమీకరించారు. గులాబీ జెండాలతో వరంగల్ నగరం ఉత్సాహభరితంగా మారింది.
కేసీఆర్, కేటీఆర్ ప్రసంగాలపై ఆసక్తి
ఈ రజతోత్సవ సభలో పార్టీ అధ్యక్షుడు కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక ప్రసంగాలు చేయనున్నారు. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ ప్రసంగం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. రాష్ట్ర పాలనపై, కేంద్రంపై, విపక్షాల విమర్శలపై కేసీఆర్ ఎలా స్పందిస్తారన్నది ఉత్కంఠను రేపుతోంది. రాబోయే ఎన్నికలకు పార్టీ కార్యచరణపై, భవిష్యత్తు లక్ష్యాలపై కూడా ఈ సభలో స్పష్టమైన దిశా నిర్దేశం చేయనున్నట్టు సమాచారం
రిపోర్టర్. ప్రతీప్ రడపాక