telanganadwani.com

BEDJJORA

బెజ్జోర బెజ్జమహాదేవి ఆలయంలో ఇటలీ సైనికుల బ్యాడ్జులు లభ్యం..

తెలంగాణ  ధ్వని :  కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు కంకణాల రాజేశ్వర్, రాష్ట్ర కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ సంయుక్తంగా వెల్లడి…
నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం లోని బెజ్జోర గ్రామంలోని బుజ్జమహాదేవి ఆలయాన్ని ఆలయ ధర్మకర్త వేముగంటి (జంగం) రాజేశ్వర్ ఆహ్వానం మేరకు బుధవారం ప్రముఖ చరిత్ర పరిశోధకుడు.
కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు కంకణాల రాజేశ్వర్ సందర్శించాడు. ఆలయం సందర్శనానంతరం గుడిలో ఒక మూలన పెట్టి ఉన్న రెండు బ్యాడ్జీలను కనుగొన్నాడు.
వాటి ఛాయా చిత్రాల్ని కొత్త తెలంగాణ చరిత్ర బృందం రాష్ట్ర కన్వీనర్ శ్రీరామాజు హరగోపాల్కు చిత్రాలను పంపడంతో వాటి గురించి సమాచారాన్ని వెతికి వివరించారు.
ఇటాలియన్ సైన్యం లోని కెప్టెన్ల బ్యాడ్జీలని, అందులో ఇటాలియన్ కొలోనియల్ హెల్మెట్(ఆర్టినరీ రెజిమెంట్ పీఠ్       హెల్మెట్)గా, రెండవది (ఇటాలి ఇటాలియన్ ఆర్మీ కావల్రీ క్యాప్ బ్యాడ్జ్) గా గుర్తించనైనది.
ఈ సందర్భంగా కంకణాల రాజేశ్వర్ మీడియాతో మాట్లాడుతూ రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో ఈ బ్యాడ్జ్ లను అప్పటి సైనికులు ధరించే వారని అన్నారు.
ఈ బ్యాడ్జీలు ఈ గుడిలోకి ఎలా వచ్చాయో తెలియ రావడం లేదు. కానీ గుడిలో భద్రపరచడం వల్లనే  వీటి గురించి తెలుసుకునే అవకాశం లభించింది.
ఈ బ్యాడ్జు (పతాకాలు) లను తెలంగాణ వారసత్వ శాఖ వారు మ్యూజియంలో భద్రపరచాలని స్థానికులు కోరుతున్నారు.
రిపోర్టర్.ప్రతీప్ రడపాక

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top