బై బ్యాక్ పాలసీ” పేరుతో ఆకర్షణస్కీమ్‌లు 90 మందికిపైగా ప్రజలు మోసం
లక్షలు, కోట్లు పెట్టినవారు డబ్బు తిరిగి పొందేందుకు పోరాటం ప్రారంభించారు.
25 మంది బాధితులు సైబరాబాద్ ఈవోడబ్ల్యూ (Economic Offences Wing) పోలీసులను ఆశ్రయించారు.
90 మందికిపైగా ప్రజలు ఈ మోసానికి గురయ్యారు.
తెలంగాణ ధ్వని : హైదరాబాద్‌లో ఆర్థిక మోసాలు పెరుగుతున్నాయి హైదరాబాద్‌లో ఆర్థిక మోసాలు పెరుగుతున్నాయి. లాభాల ఆశ చూపి ప్రజలను మోసం చేసే కేటుగాళ్ల సంఖ్య రోజురోజుకూ ఎక్కువవుతోంది. తాజాగా, “బై బ్యాక్ స్కీమ్” పేరుతో ఓ సంస్థ రూ.12 కోట్ల మోసం చేసింది. “వీ వోన్ ఇన్ఫ్రా గ్రూప్” (We Own Infra Group) పేరిట కూకట్‌పల్లిలో కార్యాలయం ఏర్పాటు చేసిన సురేశ్, వెంకటేశ్, వంశీకృష్ణ అనే ముగ్గురు వ్యక్తులు, పెట్టుబడి పెడితే రెట్టింపు లాభాలు వస్తాయని నమ్మబలికారు. దీనివల్ల 90 మంది పైగా బాధితులు భారీగా డబ్బు పోగొట్టుకున్నారు.లక్షలు, కోట్లు పెట్టినవారు డబ్బు తిరిగి పొందేందుకు పోరాటం ప్రారంభించారు.తమ కష్టార్జిత సొమ్మును తిరిగి ఇప్పించాలని ఫిర్యాదు చేశారు.ప్రారంభంలో స్వల్ప లాభాలు, ఆపై దోపిడీ25 మంది బాధితులు సైబరాబాద్ ఈవోడబ్ల్యూ (Economic Offences Wing) పోలీసులను ఆశ్రయించారు.సంస్థ ఓపెన్ ప్లాట్లు, బంగారం లాంటి ఆస్థులపై పెట్టుబడి పెడితే “బై బ్యాక్ పాలసీ” కింద ప్రతి నెలా రాబడిని అందిస్తామన్నారు.25 నెలల్లో పెట్టిన డబ్బు రెట్టింపు అవుతుందని చెప్పి ప్రజలను నమ్మబలికారు.
ప్రజలను మోసగించడానికి ఏజెంట్లను నియమించారు.సామాన్యులకు అర్థం అయ్యేలా ఆకర్షణీయమైన ప్రకటనలు, అవగాహన సమావేశాలు నిర్వహించారు.ప్రారంభంలో స్వల్ప లాభాలు, ఆపై దోపిడీమొదట్లో కొంతమందికి తక్కువ మొత్తంలో రాబడి ఇచ్చి మరింత మంది పెట్టుబడి పెట్టేలా ప్రేరేపించారు.కొద్ది నెలలకే రాబడులు నిలిపివేశారు.సంస్థ కార్యాలయానికి వెళ్లినవారికి పొంతనలేని సమాధానాలు చెబుతూ, కాలయాపన చేశారు.తమ కష్టార్జిత సొమ్మును తిరిగి ఇప్పించాలని ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.నిందితుల్లో వెంకటేశ్, వంశీకృష్ణ ను అరెస్ట్ చేశారు.ప్రధాన సూత్రధారి సురేశ్ పరారీలో ఉన్నాడు.అతని కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.బాధితులకు న్యాయం చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు.
రిపోర్టర్. ప్రతీప్ రడపాక .