- హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య..
తెలంగాణ ధ్వని : జిల్లాలో వివిధ బ్యాంకులు 2024-25 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య బ్యాంకర్లకు సూచించారు.
మంగళవారం కలెక్టరేట్‌లో ఈఆర్థిక సంవత్సరంలో ఆర్థిక లక్ష్యం, అందించిన రుణాలు, చేరాల్సిన లక్ష్యాల ప్రణాళిక తదితర అంశాలపై జిల్లా స్థాయి సంప్రదింపుల కమిటీ సమావేశం నిర్వహించారు.
ఈసందర్భంగా జిల్లా సంప్రదింపుల కమిటీ చైర్‌పర్సన్, కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ.. వార్షిక రుణ ప్రణాళిక ఆధారంగా బ్యాంకులు నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు.
మహిళా స్వయం సహాయక సంఘాల పురోభివృద్ధి సాధించేందుకు బ్యాంకు లింకేజీ రుణాలు అందించాలన్నారు. అలాగే దామెర మండలానికి సంబంధించిన బ్యాంకు ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
కార్యక్రమంలో ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్, డీఆర్డీఓ పీడీ మేన శ్రీను, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ శ్రీనివాస్, నాబార్డ్ ఏజీఎం చైతన్య రవికుమార్, ఆర్‌బీఐ అధికారి తానియా, జీడబ్ల్యూఎంసీ డిప్యూటీ కమిషనర్.
రాజేశ్వర్, జిల్లా పరిశ్రమల శాఖ జీఎం నవీన్‌కుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాలరాజు, మైనార్టీ వెల్ఫేర్ అధికారి మురళీధర్‌రెడ్డి, బీసీ వెల్ఫేర్ అధికారి లక్ష్మణ్, వివిధ బ్యాంకుల, శాఖల అధికారులు పాల్గొన్నారు.
రిపోర్టర్. ప్రతీప్ రడపాక