-
2 మంది ఏరియా కమిటీ సభ్యులు (ACMs)
-
4 మంది పార్టీ సభ్యులు
-
3 మంది మిలీషియా సభ్యులు
-
1 కేఏఎంఎస్ సభ్యుడు
-
4 మంది వీసీఎంఎలు (VCMs)
-
వీరిలో 3 మంది మహిళలు ఉన్నారు.
తెలంగాణ ధ్వని : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన 14 మంది సభ్యులు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఎదుట లొంగిపోయారు. లొంగిపోయినవారిలో ఇద్దరు ఏరియా కమిటీ సభ్యులు, నలుగురు పార్టీ కార్యకర్తలు, ముగ్గురు మిలీషియా సభ్యులు, ఒక కేఏఎంఎస్ కార్యకర్త, నలుగురు వీసీఎంఎలు ఉన్నారు.
వీరిలో ముగ్గురు మహిళలు కూడా ఉండడం గమనార్హం. పోలీస్ శాఖ మరియు సీఆర్పీఎఫ్ 81వ, 141వ బెటాలియన్ల ఆధ్వర్యంలో అమలవుతున్న ‘ఆపరేషన్ చేయూత’ పేరుతో చేపట్టిన పునరావాస ప్రోత్సాహక చర్యల నేపథ్యంలో ఈ లొంగుబాట్లు చోటు చేసుకున్నాయని జిల్లా పోలీసులు తెలిపారు.
జనవరి 2025 నుండి ఇప్పటివరకు మొత్తం 227 మంది మావోయిస్టులు లొంగుబాటుకు ముందుకొచ్చారు. లొంగుబాట్లు ప్రభుత్వం చేపట్టిన పునరావాస పథకాల విజయాన్ని ప్రతిబింబిస్తున్నాయని అధికారులు పేర్కొన్నారు.
రిపోర్టర్. ప్రతీప్ రడపాక