తెలంగాణ ధ్వని : ఆపరేషన్ సిందూర్ అనంతరం భారతదేశం మరియు పాకిస్తాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో, అమెరికా జోక్యంతో ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించినప్పటికీ, పాకిస్తాన్ కొద్ది గంటల్లోనే విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది.
శనివారం అర్థరాత్రి జమ్మూ కశ్మీర్ సరిహద్దులో పాక్ డ్రోన్ల ద్వారా దాడికి యత్నించింది. ఈ దాడికి భారత సైన్యం సమర్థవంతంగా ప్రతిస్పందించి, తగిన భద్రతా చర్యలు తీసుకుంది. అదేవిధంగా, ఆదివారం రోజున రాజస్థాన్‌లోని బారాముల్లా ప్రాంతంలో పాక్ డ్రోన్ కనిపించగా, భారత సైన్యం దానిని వెంటనే గాల్లోనే కూల్చివేసింది.
ఈ పరిణామాల నేపథ్యంలో, స్థానిక ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని సంబంధిత జిల్లా కలెక్టర్లు ప్రజలను అప్రమత్తంగా ఉండమని, అత్యవసర అవసరాలు తప్ప ఇంటి బయటకు రావొద్దని సూచించారు. ప్రజల సహకారంతో భద్రతా వ్యవస్థ మరింత బలపడుతుంది.
భద్రతా పరిరక్షణ కోసం భారత సైన్యం పూర్తిగా అప్రమత్తంగా ఉండి, ప్రతి ఉల్లంఘనకు తగిన విధంగా స్పందించేందుకు సిద్ధంగా ఉంది. రిపోర్టర్ : అనుష కల్తి