తెలంగాణ ధ్వని : భారత్, పాక్ యుద్ధ వాతావరణ నెలకొంటున్న సమయంలో భారత్ సహసోపేత చర్య చేసింది. భారత నావికాదళం గురువారం స్వదేశీ క్షిపణి నౌక INS సూరత్‌పై ఓ క్షిపణిని ప్రయోగించింది.
లష్కరే తోయిబా అనుబంధ ఉగ్రసంస్థ ”టీఆర్ఎఫ్” ఉగ్రవాదుల కాల్పుల్లో 26 మంది టూరిస్టుల మరణించారు. దీంతో ప్రజలు పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇప్పటికే అరేబియా సముద్రంలోకి భారత నేవీ ఐఎన్ఎస్ విక్రాంత్ ప్రవేశించింది. ఇది ప్రస్తుతం పాకిస్తాన్ దిశలో ఉంది. భారత నేవీ సీ స్కిమ్మింగ్ టార్గెట్లను ఖచ్చితంగా ఛేదించే పరీక్షల్ని విజయవంతంగా నిర్వహించింది.
ఇదిలా ఉంటే, మరోవైపు భారత వైమానిక దళం తన కీలకమైన సైనిక విన్యాసాలను చేపట్టింది.
“ఎక్సర్సైజ్ ఆక్రమన్” పేరు భారీ ఎత్తున సైనిక విన్యాసాలు నిర్వహించింది. గురువారం సెంట్రల్ సెక్టార్‌లో పెద్ద ఎత్తన వార్ గేమ్ ఎక్సర్సైజ్ నిర్వహించింది.
పర్వతాలు, భూతల లక్ష్యాలను దాడి చేసే సామర్థ్యాలపై దృష్టి పెట్టింది. ఈ ఎక్సర్సైజ్‌లో రాఫెల్ యుద్ధ వివానాలు పాల్గొన్నాయి. ఇందులో ”లాంగ్ రేంజ్ దాడులు”, శత్రు స్థావరాలపైన దాడుల వంటి వాటిని నిర్వహించాయి.
వైమానిక దళాని చెందిన కీలక ఆస్తులు పలు వైమానిక స్థావరాల నుంచి తూర్పు వైపుగా తరలించినట్లు తెలుస్తోంది. పంజాబ్ అంబాలాలో, పశ్చిమ బెంగాల్ హషిమారాలో వైమానిక దళం రెండు రాఫెల్ స్వ్కాడ్రన్లను మోహరించింది
రిపోర్టర్. ప్రతీప్ రడపాక