telanganadwani.com

LandSurvey

భూ సర్వేలో సర్వేయర్ల పాత్ర కీలకం….

  • వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారద…
  • వరంగల్‌లో లైసెన్స్ సర్వేయర్ల శిక్షణ కార్యక్రమం ప్రారంభం..

  • ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థుల వసతుల పట్ల కలెక్టర్ ఆదేశాలు.

  • రాసి సీడ్స్ కంపెనీ గోదాం పరిశీలించారు ..

తెలంగాణ ధ్వని : వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారద మంగళవారం సర్వే సెటిల్మెంట్ భూ రికార్డుల శాఖ ఆధ్వర్యంలో సీకేఎం కళాశాలలో లైసెన్స్ సర్వేయర్లకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

భూముల సర్వేలో సర్వేయర్ల పాత్ర ఎంతో కీలకమని తెలిపారు. భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి చట్టాన్ని అంబేడ్కర్ జయంతి (ఏప్రిల్ 14)న అమల్లోకి తేవడం జరిగిందని,

చట్టం ప్రకారం గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయడం లక్ష్యంగా రాష్ట్రంలో 6 వేల మంది లైసెన్స్ సర్వేయర్లను నియమించనున్నట్లు తెలిపారు. జిల్లాలో 315 మంది సర్వేయర్లకు 50 రోజుల పాటు శిక్షణ ఇవ్వడం సోమవారం ప్రారంభమైందని,

శిక్షణ అనంతరం పరీక్షలో ఉత్తీర్ణులైన వారిని మాత్రమే సర్వేయర్లుగా నియమిస్తామని స్పష్టం చేశారు. శిక్షణ అభ్యర్థులకు మెటిరియల్ కిట్లు అందజేశారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్వో విజయలక్ష్మి, ల్యాండ్ సర్వే అధికారి దేవరాజు, డీఐ నాగభూషణం, తహసీల్దార్ మహ్మద్ ఇక్బాల్ పాల్గొన్నారు.

దీని పక్కగా, సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్లు, అధికారులు పాల్గొని ప్రభుత్వ కార్యక్రమాల అమలులో కలెక్టర్ల ముఖ్యమైన పాత్రపై చర్చించారు.

  • ప్రభుత్వ హాస్టల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్‌…

అదే సమయంలో కలెక్టర్ సత్యశారద జిల్లా ప్రభుత్వ హాస్టల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్‌లో విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు మౌలిక వసతులు ఏర్పాట్లపై ఆర్సీఓలతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

హాస్టళ్లలో విద్యార్థులు సురక్షితంగా, ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించాలని, కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేయాలని, కంప్లైంట్స్ బాక్స్ ఏర్పాటు చేయాలని సూచించారు.

  • రాసి సీడ్స్ కంపెనీ గోదాం

అదే రోజున గీసుకొండలోని రాసి సీడ్స్ కంపెనీ గోదాం పరిస్ధితులను పరిశీలించి గోదాం నుంచి వరంగల్, ఖమ్మం, కరీంనగర్ కు విత్తన పంపిణీ సజావుగా జరగాలని కలెక్టర్ సూచనలు ఇచ్చారు.

ఈ పరిశీలన కార్యక్రమంలో అదనపు కలెక్టర్, డీఆర్వో, బీసీ, ఎస్సీ, ట్రైబల్, మైనార్టీ వెల్ఫేర్ అధికారులు, ల్యాండ్ సర్వే అధికారి, తహసీల్దార్, వ్యవసాయ అధికారి తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్. ప్రతీప్  రడపాక 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top