తెలంగాణ ధ్వని : ప్రయాగ్‌రాజ్ మహాకుంభ్ మేళా (Mahakumbh Mela)లో మరోసారిఅగ్నిప్రమాదం చోటుచేసుకుంది
సెక్టార్ 16లో కిన్నర్ అఖారా క్యాంప్ వద్ద మంటలు:
సోమవారం ఉదయం 9.30 గంటలకు కిన్నర్ అఖారా క్యాంప్ నుంచి పొగలు రావడం గమనించిన ఫైర్ సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
సరైన స్పందనతో ప్రమాదం నివారణ:
నీళ్లు, ఇసుక చల్లడం ద్వారా స్థానికులు ప్రాథమికంగా మంటలు ఆర్పివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
ముందురోజు భారీ అగ్నిప్రమాదం:
ఆదివారం సెక్టార్ 19లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 18 టెంట్లు దగ్ధం కాగా, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
అధికారుల ప్రకటన:
శ్రీ హరి దివ్య సాధనా పీఠ్ క్యాంపు వద్ద ఒక చిన్న టెంట్ మాత్రమే మంటల్లో చిక్కుకుందని, ప్రాణనష్టం లేకపోవడంతో అధికారులు ఊరట వ్యక్తం చేశారు.రిపోర్టర్.ప్రతీప్ రడపాక