తెలంగాణ ధ్వని : సమాజం లో కష్టంలో ఉండేవాళ్ళకు సేవ చేయాలి అనే గొప్ప మనసు అందరికీ ఉండదు. అలాంటి మనసు ఉన్న వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి వారిలో ఒకరు రాఘవ లారెన్స్
ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన లారెన్స్ కెరీర్ ప్రారంభం లో గ్రూప్ డ్యాన్సర్ గా నెట్టుకొచ్చేవాడు. ఇతని లోని టాలెంట్ ని గమనించి మెగాస్టార్ చిరంజీవి తన ముఠామేస్త్రి చిత్రం లో టైటిల్ సాంగ్ కి కొరియోగ్రఫీ చేసే అవకాశం దక్కింది.
ఆ పాట పెద్ద హిట్ అవ్వడంతో ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుసగా బ్లాక్ బస్టర్ సాంగ్స్ కి కొరియోగ్రఫీ చేస్తూ దేశంలోనే టాప్ 2 కొరియోగ్రాఫర్స్ లో ఒకరిగా మారిపోయాడు. ఆ తర్వాత హీరోగా, డైరెక్టర్ గా కూడా మారి ఎన్నో సూపర్ హిట్స్ ని అందుకున్నాడు.
కెరీర్ లో ఉన్నత స్థాయికి వచ్చిన తర్వాత ఒక ట్రస్టుని స్థాపించి అనాధులను, అంగవికలాంగులను దగ్గరకు తీసి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసాడు. ఎవరికీ ఏ అవసరం వచ్చినా రాఘవ లారెన్స్ దగ్గరకు వెళ్తే చాలు ఖాళీ చేతులతో పంపడు అని అతని దగ్గర నుండి సహాయ సహకారాలు పొందినవారు చెప్తూ ఉంటారు.
రీసెంట్ గా ఒక తల్లి తన కూతురు పెళ్లి కోసం దాచుకున్న డబ్బు పూర్తిగా చెదలు పట్టడం తో ఆమె విలవిలలాడిపోయింది. ఈ విషయం లారెన్స్ వరకు చేరగా, ఆయన వెంటనే ఆమెని తన వద్దకు పిలిపించుకొని, ఆమె బాగోగులు అడిగి తెలుసుకొని.
కూతురు పెళ్ళికి అవసరమయ్యే డబ్బులు మొత్తం అందించి ఆమెని ఇంటికి తిరిగి పంపించాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.
లారెన్స్ ఇలాంటి కార్యక్రమాలు ఒక్కటా రెండా ఎన్నో చేస్తూ వచ్చాడు. ఎన్నో వేల మంది ఆయన పేరు చెప్పుకొని సంతోషంగా బ్రతుకుతున్నారు.
ఇక లారెన్స్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన కాంచన 4 మూవీ షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. ఇందులో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.
అదే విధంగా ప్రముఖ దర్శకుడు లోకేష్ కనకరాజ్ నిర్మిస్తున్న బెంజ్ అనే సినిమాలో కూడా ఆయన హీరో గా నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాల షూటింగ్స్ సమాంతరంగా జరుగుతున్నాయి.
ఇలా ఒక పక్క డైరెక్టర్ గా, మరో పక్క హీరోగా రాఘవ లారెన్స్ వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ గా ఉన్నాడు.
రిపోర్టర్. ప్రతీప్ రడపాక