telanganadwani.com

మిషన్ శక్తి తో.మహిళల సాధికారికత,బాలికల భద్రత.. భరోసా

  •  జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
మిషన్ శక్తి ద్వారా జిల్లాలోని బాల,బాలికలకు భద్రత, భరోసా కల్పించడంతోపాటు  మహిళల సాధికారత కోసం వివిధ అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు
జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ శాఖ  ద్వారా మహిళలు సామాజిక,ఆర్థిక సాధికారతను ప్రోత్సహించడం  కోసం…క్షేత్రస్థాయిలో మహిళా చైతన్యానికి..జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు (395) అవగాహన కార్యక్రమాలను చేపట్టి..
తద్వారా జిల్లా సమాఖ్య, మండల సమాఖ్య, గ్రామ సమాఖ్య సభ్యులకు గాను మొత్తం (31,247) మందికి మహిళా సాధికారతకు కావల్సిన అన్ని ప్రభుత్వ పథకాల గురించి విస్తృతంగా అవగాహన కల్పించామన్నారు
అలాగే బాల బాలికల సంరక్షణ, అభివృద్ధి, రక్షణ కోసం వివిధ చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్   తెలిపారు బాలికలు ఉపయోగించిన శానిటరీ నాప్కిన్స్ ని చెత్త డబ్బాల్లో వేయటం
వల్ల నాప్కిన్లోని ప్రమాదకరమైన రసాయనాల కారణంగా ఆరోగ్య సంబంధిత సమస్యలు తలెత్తకుండ..ప్రభుత్వ పాఠశాలలో చదివే  బాలికల కోసం ఇన్సినరేటర్ల ను జిల్లాలోని ప్రతి పాఠశాల, కళాశాలల్లో ఏర్పాటు చేశామన్నారు
జిల్లా సంక్షేమ అధికారిణి, జిల్లా హబ్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ (DHEW) నిర్వహించిన బేటీ బచావో – బేటీ పడావో (BBBP) కార్యక్రమం కింద జిల్లాలోని (12) కేజీబీవీలు, మోడల్ పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలు,
సాంఘీక సంక్షేమ కళాశాలలు, అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు, ఎస్టీ డిగ్రీ కళాశాలలో విద్యార్థినుల కోసం రుతుక్రమ సంరక్షణకు శానిటరీ నాప్కిన్ లను దహనం చేసే *ఇన్సినరేటర్* (దహన యంత్రం) లను ఏర్పాటు చేసామన్నారు
అంతే కాకుండా..బాలికల భద్రత, రక్షణ, రుతుచక్ర పరిశుభ్రత, పౌష్టికాహారం తీసుకోవడం, తదితర అంశాల పైన అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు
బాలికల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని అత్యంత జాగ్రత్తగా వీటిని ఏర్పాటు చేయడం వల్ల ఎంతో మంది విద్యార్థినులకు ప్రయోజనం చేకూరిందని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు
SANTARY ఇన్సినరేటర్ మాకు చాలా ఉపయోగకరం
ఈ శానిటరీ నాప్కిన్స్ దహన యంత్రాన్ని మేము బాగా ఉపయోగించుకుంటున్నాం. ఒకప్పుడు వాడిన నాప్కిన్ లను చెత్త డబ్బాల్లో వేసేవాళ్ళం. దాంతో దుర్వాసన వచ్చేది. కానీ ఇప్పుడు ఈ యంత్రాన్ని వినియోగించుకుంటూ ఆరోగ్యవంతంగా ఉన్నాం.
సీహెచ్. వినిత, 9వ తరగతి విద్యార్థిని, కేజీబీవీ, లింగాల ఘనపురం..
సురక్షితంగా ఉంటున్నాం..ఈ ఇన్సినేరేటర్ వాడకంతో మాకు ఎలాంటి ఆరోగ్య సంబంధిత సమస్యలు తలెత్తకుండా సురక్షితంగా ఉంటున్నాం.
ఏ. తేజ శ్రీ, 9వ తరగతి విద్యార్థిని, కేజీబీవీ, పాలకుర్తి జిల్లా కలెక్టర్ గారికి ధన్యవాదాలు…
 విద్యార్థినులు ఉపయోగించే శానిటరీ నాప్కిన్స్ అందులో వేసి కాల్చడం జరుగుతుందని… దీంతో పాఠశాలల పరిసరాలు పరిశుభ్రంగా ఉంటున్నాయని .
వీటిని ఏర్పాటు చేయడంలో ప్రత్యేక చొరవ చూపిన *కలెక్టర్* కి పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top