telanganadwani.com

MedchalFire

మేడ్చల్‌లో భారీ అగ్ని ప్రమాదం…….

తెలంగాణ ధ్వని : మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో  మంగళవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గుండ్ల పోచంపల్లి మున్సిపల్ పరిధిలో బాసరగాడిలో గల కేకేసీ ఎలక్ట్రికల్స్ అనే ఫ్యాన్ తయారీ పరిశ్రమలో ఈ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది…
అగ్ని ప్రమాదం జరగడంతో స్థానికులు తీవ్ర భయాందో ళనలు చెందుతున్నారు. వెంటనే పోలీసులకు, ఫైర్ సిబ్బందికి స్థానికులు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి పోలీసులు ఫైర్ సిబ్బంది చేరుకున్నారు.
మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. భారీగా మంటలు వ్యాపించడంతో చుట్టూ పక్కల పొగలు అలుముకున్నాయి. పొగలు దట్టంగా వ్యాపించడంతో చుట్టుపక్కల స్థానికులు శ్వాస తీసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు.
స్థానికులను భద్రత పరంగా సంఘటన స్థలం నుంచి పోలీసులు దూరంగా పంపించి వేస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియా ల్సి ఉంది. అసలు ఈ ప్రమాదం ఎలా చోటు చేసుకుందనే విషయంపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
అయితే వరుస అగ్ని ప్రమాదాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని, పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా ప్రభుత్వం కఠినమైన భద్రతా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
రిపోర్టర్. ప్రతీప్ రడపాక 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top