తెలంగాణ ధ్వని : రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 3 నుంచి మార్చి 31 వరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ముస్లిం ఉద్యోగులు, టీచర్లు, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్, బోర్డ్స్, కార్పొరేషన్స్, పబ్లిక్ సెక్టార్ ఉద్యోగులకు సాయంత్రం 4 గంటలకే విధుల నుంచి వెళ్ళిపోవడానికి అనుమతి ఇచ్చినట్లు ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొంది.
ప్రత్యేక ప్రార్థనల కోసం సౌకర్యం
రంజాన్ మాసంలో ముస్లింలు ఉపవాస దీక్షలతో పాటు ప్రత్యేక నమాజ్‌లు నిర్వహిస్తారు. ప్రత్యేకంగా, ఇషా నమాజ్ అనంతరం తరావీహ్ నమాజ్ చేయడం కోసం వీరికి సమయ పరిమితి తగ్గిస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఉపవాస దీక్షల కారణంగా ఉద్యోగులు మరింత శారీరక, మానసిక ఒత్తిడికి గురి కావచ్చన్న కారణంతో ఈ వెసులుబాటు కల్పించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా తెలంగాణ
ప్రతి ఏడాది రంజాన్ మాసంలో తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి ప్రత్యేక చర్యలు తీసుకోవడం ఆనవాయితీగా మారింది. ఇతర రాష్ట్రాల్లోనూ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్న డిమాండ్ వస్తోంది.
ఈ ఉత్తర్వుల ద్వారా ముస్లిం ఉద్యోగులకు మరింత సౌలభ్యం కలుగుతుందని అధికార వర్గాలు తెలియజేశాయి.
రిపోర్టర్. ప్రతీప్. రడపాక