telanganadwani.com

RatnakarReddy

రాపాక గుట్టలో అత్యంత చిన్న మానవాకృత శిల్పం గుర్తింపు..

డిస్కవరీ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి బృందం ఘనత.

  • శిల్పం విశేషాలు:DiscoveryMan
  • ఎత్తు: 28 సెంటీమీటర్లు

  • బరువు: 9.235 గ్రాములు

  • చుట్టు కొలత పొడవు: 69 సెంటీమీటర్లు

  • అడ్డం చుట్టు కొలత: 47 సెంటీమీటర్లు

తెలంగాణ ధ్వని :  హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని రాపాక గ్రామ శివారులో మరో చారిత్రక ఆవిష్కరణ వెలుగులోకి వచ్చింది.
పురావస్తు పరిశోధకుడు రెడ్డి రత్నాకర్ రెడ్డి తన బృందంతో కలిసి రాపాక గుట్టపై పరిశోధనలు నిర్వహించారు.ఈ సందర్భంగా బృహద్ శిలాయుగం నాటి మానవాకృత శిల్పాన్ని గుర్తించారు.


ఈ శిల్పం కేవలం 28 సెంటీమీటర్ల ఎత్తు కలిగి ఉండడం విశేషం.తెలంగాణలో ఇప్పటివరకు కనుగొన్న శిల్పాల్లో ఇది అత్యంత చిన్నదిగా గుర్తింపు పొందింది.

శిల్పం బరువు 9.235 గ్రాములు, చుట్టుకొలత 69 సెం.మీ., అడ్డంగా 47 సెం.మీ. ఉంది.ఇది మట్టిలో కూరుకుపోయి ఉండగా, తల భాగం కొంత విరిగిపోయింది.శిల్పంపై మూడు వైపులా ఉన్న నునుపైన గీతలు మానవ ఆకృతిని స్పష్టంగా చూపిస్తున్నాయి.


ప్రాథమికంగా ఇది ఆది మానవుల ఆరాధనా సాధనంగా భావిస్తున్నారు.ఈ ప్రాంతం శిలాయుగ మానవుల నివాస ప్రాంతంగా భావించబడుతోంది.అలాగే డోల్మెన్ సమాధులు, గ్రూవ్‌ కలిగిన శిలలూ ఇక్కడ కనిపించాయి.
రాక్షస గూళ్ళు సమాధులు సాగు కింద తొలగించబడ్డాయి.

ఈ శిల్పం పూర్వకాలపు కళా అభిరుచి, ఆధ్యాత్మిక విశ్వాసాలకు దర్పణంగా నిలుస్తోంది.ఇంతకుముందు జనగామ జిల్లాలో భారీ శిల్పాన్ని రెడ్డే గుర్తించారు.ఇప్పుడు అదే బృందం చిన్న శిల్పాన్ని కనుగొనడం అరుదైన ఘట్టంగా నిలిచింది.


రాపాక వంటి ప్రదేశాల్లో చారిత్రక సంపద మున్ముందు కాపాడాల్సిన అవసరం ఉంది.ప్రతి గ్రామంలో గ్రామీణ మ్యూజియం ఏర్పాటుతో ఇటువంటి ధార్మిక నిధులు రక్షించవచ్చు.రెడ్డి బృందం సూచనలకు పరిశీలన అవసరమైందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

రిపోర్టర్.ప్రతీప్ రడపాక

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top