తెలంగాణ ధ్వని : తెలంగాణలో లేడీ అఘోరీను రూ.9.5 లక్షల మోసం కేసులో అరెస్ట్ చేశారు. ఆమె పూజల పేరుతో ఒక సినీ ప్రొడ్యూసర్‌ని మోసం చేసి భారీ మొత్తంలో డబ్బులు తీసుకుంది. ప్రొడ్యూసర్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. ఫిర్యాదులో ప్రొడ్యూసర్ పేర్కొన్నట్లు, మొదటగా అఘోరీ రూ.5 లక్షలు తన అకౌంట్‌లో వేసుకోమని కోరింది. పూజ కోసం ఆమె ఉజ్జయినిలోని ఫామ్ హౌస్‌లో తీసుకెళ్లి, పూజలు చేసి వేరే మరో ₹5 లక్షలు డిమాండ్ చేసింది. లేకపోతే పూజ విఫలమవుతుందని అఘోరీ భయపెట్టింది. సన్నిహిత బెదిరింపులతో ప్రొడ్యూసర్ మరింత ₹5 లక్షలు తన అకౌంట్‌లో వేసింది. ఈ మొత్తం ₹10 లక్షలను వసూలు చేసి, అఘోరీ మోసం చేసింది. ఆమె తదుపరి బెదిరింపులు కూడా ప్రకటించి, రూ.5 లక్షలు ఇంకా ఇవ్వాలని, లేదంటే కుటుంబాన్ని మంత్ర శక్తులతో నాశనం చేస్తానని భయపెట్టింది. దాంతో, పోలీసులు దర్యాప్తు చేసి, ఆమెను ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ సరిహద్దుల్లో అరెస్టు చేశారు. ఆమెతో పాటు వివాహం చేసుకున్న వర్షిణి కూడా హైదరాబాద్‌కు తరలించారు. అఘోరీ భక్తుల భయాలను, నమ్మకాలను దుర్వినియోగం చేసి వారి నుంచి డబ్బులు మోసగించడంతో ఈ ఘటన సంచలనం రేపింది.
రిపోర్టర్. ప్రతీప్ రడపాక