తెలంగాణ ధ్వని : వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూ జే ఐ) రూపొందించిన శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పంచాంగం/దైనందినిని బుధవారం వరంగల్ బీజేపీ సీనియర్ నాయకులు, జాతీయ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ ఛైర్మెన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు ఆవిష్కరించారు.
ఓ సిటీ లోని తన నివాసంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఆయన, ఈ సందర్భంగా పాత్రికేయులకు, తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. అలాగే, డబ్ల్యూ జే ఐ కృషిని అభినందిస్తూ, వారు చేపట్టే అన్ని కార్యక్రమాలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో డబ్ల్యూ జే ఐ తెలంగాణ రాష్ట్ర సెక్రటరీ ఎన్. ఎస్. రావు, వరంగల్ జిల్లా కన్వీనర్ పులి శరత్ కుమార్, యంసాని శ్రీనివాస్,రడపాక ప్రతీప్, యామ్స్ పెన్ అసోసియేట్ ఎడిటర్ కొత్తపల్లి రమేష్, భూక్యా సిద్దు నాయక్, ప్రదీప్ నాయక్, బీజేపీ నాయకులు రాజేశ్వర్ రావు, పీఆర్ ఓ వినయ్ పటేల్, పీ ఏ సంపత్, రాజేందర్, బీ సతీష్ గౌడ్, ఏ రాధా కృష్ణ, చింతపట్ల సాయి కుమార్, గోపాల్ రావు, శోభారాణి రమేష్ కాందాల, షణ్ముఖ చారి తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్. ప్రతీప్ రడపాక