- వరంగల్‌లో విత్తనాలపై ఆకస్మిక తనిఖీ.
- లైసెన్స్ ప్రదర్శన, సంతకాల రసీదు తప్పనిసరి..
తెలంగాణ ధ్వని : వరంగల్ స్టేషన్ రోడ్‌లో జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో విత్తనాల స్క్వాడ్ బృందం ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. రైతులకు నాణ్యమైన విత్తనాల పంపిణీని నిర్ధారించడంతోపాటు.
నకిలీ విత్తనాల విక్రయాన్ని అడ్డుకోవడమే ఈ తనిఖీల ప్రధాన లక్ష్యం. గాయత్రి సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ మరియు అరుంధతి సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ షాపులపై తనిఖీలు చేపట్టబడ్డాయి.
ఈ దుకాణాలలో కళాష్ సీడ్స్ కంపెనీ సరఫరా చేసిన పత్తి విత్తనాలకు సంబంధించి లైసెన్స్ రెన్యువల్ పత్రాలు చూపించలేకపోవడం వల్ల 580 ప్యాకెట్లపై స్టాప్ సేల్ విధించారు. వీటి విలువ రూ. 5,22,580గా ఉంది.
అదేవిధంగా మిర్చి విత్తనాల ప్యాకెట్లపైనా అనుమతుల లేమి కారణంగా రూ. 1,61,400 విలువ గల విత్తనాలపై స్టాప్ సేల్ విధించారు. మొత్తం రూ. 6,85,980 విలువైన విత్తనాలపై చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
తనిఖీ సమయంలో షాప్ యజమానులకు పలు సూచనలు చేయబడ్డాయి. విత్తన లైసెన్సులు షాపులో అందరికీ కనిపించేలా ఉంచాలని, రైతులకు విత్తనాలు ఇచ్చే ముందు వారి సంతకాలు తప్పనిసరిగా తీసుకోవాలని తెలియజేశారు.
రికార్డులు సమర్ధవంతంగా నిర్వహించాలని తెలిపారు. నిబంధనలు పాటించనిది గుర్తింపు కోల్పోయే అవకాశముందని హెచ్చరించారు. భవిష్యత్తులో కూడా ఇటువంటి తనిఖీలు కొనసాగుతాయని అధికారులు పేర్కొన్నారు.
ఈ తనిఖీల్లో ఏ. డి. ఏ .శ్రీ కె.ఏ. గౌసేధర్, వర్ధన్నపేటఏ. డి. ఏ .నరసింహం, వ్యవసాయ అధికారులు రవీందర్, యాకయ్య, విజయ్ ,అలాగే పోలీస్ విభాగం నుండి కరుణాకర్ గారు పాల్గొన్నారు.
రిపోర్టర్. ప్రతీప్ రడపాక